త్రిషపై పెద్ద కుట్రపన్నిన స్టార్ హీరో తండ్రి.. ఎంత టార్చర్ చేశాడంటే..

ప్రముఖ నటి త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్, కన్నడ అని తేడా లేకుండా సౌత్ ఇండస్ట్రీ మొత్తంలో స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. త్రిష ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు చాలా మంది హీరోలు త్రిష అందానికి ఫిదా అయ్యి తమ సినిమాలో వరుస అవకాశాలు ఇచ్చారు. ఈ అందాల తార ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ బ్యూటీకి ఏ డ్రెస్ వేసినా కరెక్ట్ గా సూట్ అయ్యేవి.

‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ చిన్నది. అయితే ఈ సినిమా ఆమెకి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ ప్రభాస్ తో నటించిన ‘వర్షం’ సినిమా ఆమెకి స్టార్డమ్‌ తెచ్చిపెట్టింది. ఆ తరువాత సిద్ధార్థ్ తో కలిసి నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా కూడా ఆమెకి మంచి హిట్ ని అందించింది. ఇక కృష్ణ, అతడు లాంటి సినిమాలు కూడా ఆమెకి ప్రేక్షకులో మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి.

అలా ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలతో తెలుగులో దూసుకుపోయిన త్రిష ప్రస్తుతం తెలుగు సినిమాలో కనిపించడం లేదు. గత ఏడాది పొన్నియన్ సెల్వన్ సినిమాలో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించింది. నిజానికి తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది కానీ తెలుగులో మాత్రం కనిపించడం లేదు. అసలు త్రిష తెలుగు ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఒక స్టార్ హీరో తండ్రి అని సమాచారం. ఆ తండ్రి ఒక నిర్మాతట.

త్రిష ఆ నిర్మాత కొడుకుతో ప్రేమలో పడిందట. ఆ విషయం ఆ నిర్మాతకు తెలియడంతో త్రిషకు వార్నింగ్ ఇచ్చాడట. అంతేకాదు సినిమాల్లో అవకాశాలు రాకుండా చేశాడట అతడి టార్చర్ భరించలేక త్రిష తెలుగు ఇండస్ట్రీకి దూరమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది జరిగి నాలుగేళ్లకు పైగానే అవుతుంది. అయినా కూడా ఇప్పటికీ త్రిష తెలుగులో మళ్లీ సినిమాలు చేయడం లేదు. అందుకే చిరంజీవి హీరోగా నటించిన ‘ఆచార్య’ సినిమాలో కాజల్ ప్లేస్ లో ముందుగా త్రిషకు అవకాశం వచ్చినా కూడా నో చెప్పిందట.

Share post:

Latest