సమంతను ఏకీపారేస్తున్న సింగర్..!!

సమంత, నాగచైతన్యతో విడిపోయిన తర్వాత పుష్ప చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించింది. దీంతో పాన్ ఇండియా లెవెల్లో ఈ పాట వైరల్ కాడమే కాకుండా సమంత క్రేజీ కూడా పెరిగింది. అయితే ఇప్పుడు తాజాగా లెజెండరీ సింగర్ ఎల్.ఆర్ ఈశ్వరి సమంత చేసిన ఈ పాట పైన పలు షాకింగ్ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది.వాటి గురించి తెలుసుకుందాం.

1960-70 లో ఎల్.ఆర్ ఈశ్వరి తన పాటలతో కుర్రకారులను మత్తెక్కించింది. ఈమె పాట పాడిందంటే కచ్చితంగా హిట్టు కావాల్సిందే అనే అంతగా ఈమె పాపులర్ అవుతూ ఉండేది. ముఖ్యంగా ఇమే మత్తెక్కించే పాటలు రాయడం వెనుక స్పందిస్తూ తాను హుషారుగా పాడగలననీ..దర్శకుడు తనకు ఆ పాటలు ఎక్కువగా ఇచ్చేవారని తెలిపింది.ముఖ్యంగా జ్యోతిలక్ష్మి ఆట, నా పాట బాగా సెట్ అవుతూ ఉండేదని తెలియజేసింది ఈశ్వరి. ఆ కాలమే ఎక్కువగా అందరికీ వసంత కాలమని తెలియజేసింది. ఆ సమయంలో యాంకర్ ఆమెతో ఊ అంటావా మామ సాంగ్ పాడించారు.. ఈ పాటపై అభిప్రాయం అడగగా ఇది ఒక పాటను పైనుంచి కింది వరకు ఒకేలా ఉంటుందని అభిప్రాయాన్ని తెలియజేస్తుంది.సమంత డాన్స్ బాగా వేసిన ఆ పాట అంతగా నచ్చలేదని తెలిపింది.

ఇక ఆరు లైన్లు ఒకేలాగా ఉన్నాయని కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఏ పాటలు అంతగా నచ్చడం లేదని మేము పాడిన పాటలు ఇప్పటికీ నిలబడడానికి కారణం అని తెలియజేసింది. సినిమాలు కూడా అదేలా ఉన్నాయని ఒక్కో సినిమా 150 రోజుల నుండి 200 రోజులు ఆడేవి కానీ ఇప్పుడు పది రోజులు ఆడితే చాలా గొప్ప అని. అప్పట్లో మేం పాడిన పాటలు పాడితే అవార్డులు వచ్చేవని తెలుపుతోంది. ఇక ఏఆర్ రెహమాన్ చాలా కష్టపడతారని తెలిపింది.

Share post:

Latest