అందుకే జబర్దస్త్ మానేశా అంటున్న వేణు..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కమెడియన్గా ఎంతో గుర్తింపు సంపాదించారు కమెడియన్ వేణు. జబర్దస్త్ లో వేణు వండర్స్ అనే టీం తో తెలుగు తెరకు పరిచయమై అందరిని కడుపుబ్బ నవ్వించేవారు. ఇక పలు సినిమాలలో కూడా నటించి తన కామెడీతో నవ్వించారు వేణు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్, గెటప్ శ్రీను ఈయన టీం నుంచే వచ్చినవారే. తన కాంగ్రెస్ కిట్లతో నవ్వులు పూజించిన టిల్లువేను అనుహంగా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు.

అయితే ఈ షో నుంచి ఎందుకు బయటకు వచ్చాడో మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే గతంలో యాజమాన్యంతో పలు విభేదాల వల్ల జబర్దస్త్ నుంచి బయటికి వచ్చినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదంటూ తెలియజేస్తున్నారు వేణు. జబర్దస్త్కు ముందు కొన్ని సినిమాలలో కమెడియన్ గా మెప్పించిన వేణు ఇప్పుడు డైరెక్టర్గా బలగం సినిమాతో సూపర్ హిట్టును అందుకున్నారు. తెలంగాణ కథాంశంతో రూపొందించిన ఈ సినిమాకు ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలోని వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వేణు ఈ సందర్భంగా జబర్దస్త్ మానేయడానికి గల కారణాలను తెలిపారు.

విభేదాల కారణంగా నేను జబర్దస్త్ నుంచి బయటికి వచ్చాను అనడంలో వాస్తవం లేదు కేవలం సినిమాల పైన ఇష్టం ఉండడంతోనే ఆ షోను వదిలేశాను మొదటి నుంచి నా లక్ష్యం సినిమానే ఫుల్ టైం సినిమాలలో రాణించాలని కోరికతోనే జబర్దస్త్ ను వదిలేయవలసి వచ్చిందని..పైగా నేను ఉన్నప్పుడు జబర్దస్త్ రేటింగ్ బాగుంది మంచి రెమ్యూనరేషన్ కూడా వచ్చేది అప్పటికి సినిమాల కోసం షోను వదులుకొని బయటికి వచ్చాను అని క్లారిటీ ఇవ్వడం జరిగింది వేణు.

 

View this post on Instagram

 

A post shared by Venu Tillu (@venu_tilloo)

Share post:

Latest