దానికోసమే ఇంత హడావిడి చేస్తున్న కీర్తి సురేష్..!!

నేను శైలజ సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది హీరోయిన్ కీర్తి సురేష్.అలా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత మహానటి సినిమాలో నటించి అద్భుతమైన నటనకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలలో నటించిన కీర్తి సురేష్ గ్లామర్ షో విషయంలో మాత్రం కాస్త చూపించడానికి వెనుకడుగు వేస్తూ ఉండేది. కానీ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రంలో కీర్తి సురేష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Keerthi Suresh, actress, bonito, bollywood, cute, tollywood, traditional,  HD phone wallpaper | Peakpx
కీర్తి సురేష్ వ్యక్తిగత విషయానికి వస్తే ఇటీవలే ఒక ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తో డేటింగ్ చేస్తోందని వార్తలు ఎక్కువగా వినిపించాయి. కానీ అవన్నీ ఊహాగానాలే అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది. కీర్తి సురేష్ దక్షిణాదికి చెందిన ప్రముఖ హీరోని వివాహం చేసుకోబోతోందని మళ్లీ ఎక్కువగా వార్తలు వినిపించాయి అయితే ఇవన్నీ కేవలం గాసిప్స్ అంటుండగానే మరొక ఆసక్తికరమైన విషయం రిలీవ్ అయింది. కీర్తి సురేష్ సన్నిహితుల వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికీ కీర్తి సురేష్ పెళ్లి గడియాలు దగ్గర పడ్డాయని తెలుస్తున్నది.

అయితే ఈ వివాహం గురించి అధికారికంగా ఇంకా నిర్ధారణ రావాల్సి ఉండగా ప్రస్తుతం సేట్స్ పైన ఉన్న సినిమాలన్నిటిని షూటింగ్ వేగవంతం చేయాలని కీర్తి సురేష్ తొందరపెడుతోందట. అలాగే చిరంజీవితో భోళా శంకర్, నానితో దసరా సినిమాలలో నటిస్తున్నది. వీటితోపాటు తమిళంలో మూడు సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్ ఒక్కొక్కటిగా షూటింగ్ని శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి కొత్త సినిమాలను కూడా ఏవి అంగీకరించలేదు ఈ ముద్దుగుమ్మ. ఇదంతా కేవలం వివాహనికే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest