సాయి పల్లవికే దక్కిన ఆ అరుదైన అవకాశం.. ఒకేసారి ముగ్గురితో..?

ప్రముఖ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాయి పల్లవి తన నటనతో, డ్యాన్స్ తో అందరిని ఫిదా చేసేసింది. ఆ తరువాత కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. అయితే ట్యాలెంట్‌తో పాటు అందం కూడా కలగలిసిన ఈ ముద్దుగుమ్మ ఈమధ్య ఎక్కువగా బిగ్ స్క్రీన్ పై కనిపించడం లేదు. గతేడాది విరాట పర్వం, గార్గి లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి పల్లవి ఈ ఏడాది మాత్రం ఇప్పటివరకు కొత్త తెలుగు సినిమాలు ఏమీ ప్రకటించలేదు.

సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు కనబడి చాలా రోజులు అవుతున్న నేపథ్యంలో ఆమె ‘నిజం విత్ స్మిత ‘ అనే టాక్ షో కి హాజరైయింది. దానికి సంబందించిన ప్రోమో నిన్న విడుదలై ప్రేక్షకులో ఆసక్తిని రెక్కేతిస్తుంది. ఈ ప్రోమోలో స్మిత, సాయి పల్లవిని ‘తారక్, బన్నీ, చరణ్ లలో ఎవరితో డాన్స్ చెయ్యాలని మీకుంది? ‘అని అడుగుతుంది.

 

ఆ ప్రశ్నకు సాయి పల్లవి సమాధానం చెప్తూ ‘ముగ్గురితో కలిసి ఒక పాటలో డాన్స్ చెయ్యాలనుందని’ సరదాగా చెప్తుంది. దాంతో అక్కడి వాతావరణం మొత్తం మరింత ఆహ్లాదకరంగా మారింది. సాయి పల్లవి కోరికను కంపల్సరిగా హీరోలు తీర్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ పట్ల తెలుగు ఇండస్ట్రీలో చాలా గౌరవం ఉంది. సో ఆమెకు ఈ కల నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి, నిజం విత్ స్మితలో సాయి పల్లవి స్మితతో పంచుకున్న మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఫుల్ ఎపిసోడ్ రేపటి నుండి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది.

Share post:

Latest