కమల్ హాసన్ మూవీలో తెలుగు కమెడియన్.. పాత్ర ఏమిటంటే..?

నాలుగేళ్ల విరామం తర్వాత కమలహాసన్ విక్రమ్ సినిమాతో మళ్ళీ మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం అందించిన బ్లాక్ బస్టర్ విజయంతో మళ్లీ రెట్టింపు జోష్ తో ఉన్న కమలహాసన్ .. పలు వివిధ కారణాల వల్ల ఆగిపోయిన శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్-2 చిత్రాన్ని మళ్లీ తెరకెక్కించారు. 1996 లో విడుదలై తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో పెను సంచలనాన్ని సృష్టించిన ఇండియన్ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సెట్లో క్రేన్ విరిగిపోవడం నలుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం దీంతో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో డైరెక్టర్ శంకర్కు లైకా ప్రొడక్షన్ కు మధ్య భేదాలు కూడా వచ్చాయని వార్తలు వినిపించాయి.

Indian 2 మూవీలో తెలుగు కమెడియన్ నెగెటివ్ రోల్.. కమల్‌తో ఢీ కొడతాడా? -  tollywood comedian playing negative role in indian 2 - Samayam Telugu

అయితే మళ్లీ ఇన్నాళ్లకు కమలహాసన్ చొరవ తీసుకొని మరి ఈ సినిమాని పట్టా లెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, సిద్ధార్థ్, ప్రియా భవాని శంకర్, సముద్రఖని బాబీ సింహ వెన్నెల కిషోర్లు కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చెన్నైలో జరుగుతోంది అక్కడే కమలహాసన్ తో పాటు నటుడు వెన్నెల కిషోర్ కూడా కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.ఇది లాంగ్ షెడ్యూల్ అన్నట్లుగా తెలుస్తోంది.

ఇదంతా ఇలా ఉండక ఈ మూవీ లో వెన్నెల కిషోర్ కీలకమైన పాత్రలో షాక్ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.అడవి శేషు నటించిన గూడచారి చిత్రంలో వెన్నెల కిషోర్ కూడా నెగిటివ్ స్టేట్స్ ఉన్న పాత్రలో నటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మూవీలో కూడా అలాంటి పాత్రలోనే నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest