Teaser: సస్పెన్స్ తో అదరగొట్టేస్తున్న వీరుపాక్ష టీజర్..!!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం విరూపాక్ష. ప్రమాదం నుంచీ కోరుకున్న తర్వాత విడుదలబోతున్న మొదటి చిత్రం ఇదే. టైటిల్తోనే అందరిని ఆకర్షిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ నటిస్తున్నది. బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథ అంశంతో ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కించడం జరిగింది.

Virupaksha Teaser Set to Release at a Specific Time
ఇక ఈ సినిమా కథ ఏంటన్న విషయంపై అందరిలో కూడా క్యూరియాసిటీ పెంచేస్తోంది. ఇదంతా ఇలా ఉండగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 21న తెలుగు మలయాళం, కన్నడ ,హిందీ వంటి భాషలలో ఒకేసారి విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ పనులను కూడా చాలా వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఈ సినిమా టీజర్ తాజాగా కొద్ది నిమిషాల క్రితం విడుదల చేయడం జరిగింది. ఈ టీజర్ అత్యంత ఆసక్తికరంగా రేపించేలా కనిపిస్తోంది.

ఈ టీజర్ చూస్తున్నంతసేపు కూడా ప్రతి ఒక్కరు ఊపిరి బిగ పట్టుకుని చూసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందులో హీరో సాయిధరమ్ తేజ్ కూడా చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నారు. తేజ్ కెరియర్ లోనే ఈ చిత్రం చాలా భిన్నమైనదిగా ఉందని చెప్పవచ్చు.మరి ఎన్నో సంవత్సరాల తర్వాత విడుదల కాబోతున్న సాయి ధరమ్ తేజ్ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.