Teaser: రావణాసుర తో భయపెట్టడానికి వస్తున్న రవితేజ..!!

మాస్ హీరో రవితేజ గత సంవత్సరం ధమాకా చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ధమాకా సినిమా తర్వాత రవితేజ నుండి వస్తున్న చిత్రం రావణాసుర. ఈ చిత్రం ఏప్రిల్ 7వ తేదీన సమ్మర్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికి విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ రవితేజ పాత్ర విషయంలో సస్పెన్స్ నెలకొన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు చిత్ర బృందం విడుదల చేయడం జరిగింది.

Ravanasura Teaser Unleashed - TeluguBulletin.com

రావణాసుర టైటిల్ కు తగ్గట్టుగానే రవితేజ నిజంగానే ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించబోతున్నారు. ధమాకా సినిమా తో ఎంటర్టైన్ ఇచ్చిన రవితేజ ఈసారి సరికొత్త పాత్రలతో త్రిల్ ఇవ్వబోతున్నట్లు ఈ టీజర్ ను చూస్తే మనకు అర్థమవుతోంది. ఈ సినిమాలోని డైలాగులు కూడా ఈ సినిమాకి మరింత ఆసక్తిని పెంచేలా కనిపిస్తున్నాయి. టీజర్ లో రవితేజ ఒక షాట్లో సీతను తీసుకువెళ్లాలి అంటే సముద్రం దాటితే సరిపోదు ఈ రావణాసురుడిని కూడా దాటాలి అంటూ చెప్పే డైలాగ్ నిలుస్తోంది.

క్రైమ్ ట్రేలర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం టీజర్ అంచనాలను పెంచేస్తోంది. రవితేజ తో పాటు ఈ సినిమాలో హీరో సుశాంత్, శ్రీరామ్, అను ఇమ్మానియేల్, మేఘ ఆకాష్, పర్యా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, రావు రమేష్ మురళీ శర్మ తదితరులు నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ దర్శకత్వంలోని తెరకెక్కించారు. ఈ చిత్రం కచ్చితంగా సక్సెస్ అవుతుందని ధీమాతోనే చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి టీజర్ వైరల్ గా మారుతోంది.

Share post:

Latest