మూడోసారి..ఆ మూడుస్థానాల్లో టీడీపీకి కష్టమే!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిదానంగా బలపడుతూ వస్తుంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన..ఇప్పుడు పికప్ అవుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..టి‌డి‌పి నేతలు బలపడటం వల్ల జిల్లాలో పలు స్థానాల్లో టి‌డి‌పి లీడ్ లోకి వస్తుంది. తాజాగా వచ్చిన సర్వేల్లో అదే స్పష్టమైంది. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. గన్నవరం, విజయవాడ ఈస్ట్ మాత్రమే గెలుచుకుంది.

అయితే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. దీంతో టి‌డి‌పికి ఒక్కరే ఎమ్మెల్యే మిగిలారు. అలాంటి పరిస్తితి నుంచి టి‌డి‌పి ఊహించని విధంగా బలపడింది. తాజా సర్వేలో జిల్లాలో 8 సీట్లు గెలుచుకుంటుందని తేలింది. విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, జగ్గయ్యపేట, పెనమలూరు, పెడన, అవనిగడ్డ, మచిలీపట్నం స్థానాల్లో టి‌డి‌పి జెండా ఎగురుతుందని తేలింది. ఇక విజయవాడ వెస్ట్, కైకలూరు, నందిగామల్లో టఫ్ ఫైట్ ఉంటుందని తేలింది.

అయితే వైసీపీ..గుడివాడ, గన్నవరం, నూజివీడు, తిరువూరు, పామర్రు స్థానాల్లో తెలుస్తుందని సర్వే తేల్చింది. అంటే ఇక్కడ గుడివాడని పక్కన పెడితే..కొత్తగా గన్నవరం పోతుంది. ఇక నూజివీడు, తిరువూరు, పామర్రు..ఈ స్థానాల్లో టి‌డి‌పి గెలవదని తేలింది.

తిరువూరులో 2004 నుంచి టి‌డి‌పి గెలవడం లేదు..పామర్రులో 2009 నుంచి టి‌డి‌పి గెలవడం లేదు. నూజివీడులో 2014 నుంచి గెలవడం లేదు..ఇప్పుడు 2024లో కూడా గెలిచేలా లేదని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఎప్పుడో 1980 కాలంలో గెలిచిన విజయవాడ వెస్ట్ లో ఈ సారి టి‌డి‌పికి కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తుంది. జనసేనతో పొత్తు ఉంటే ఆ స్థానాన్ని సులువుగా కైవసం చేసుకోవచ్చు.

Share post:

Latest