మహేష్ సిస్టర్ రోల్‌లో టాలెంటెడ్ యాక్ట్రెస్.. త్రివిక్రమ్ హిట్టు కొట్టేలా ఉన్నాడే!!

ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్లిపోతున్నాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్‌లో ఒక సినిమా రానుంది. గతంలో వీరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఇంత కాలానికి వీరు కలయికలో సినిమా రావడం ఆసక్తిని రేపుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయింది. మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. కానీ ఆ తర్వాత కాస్త బ్రేక్ వచ్చింది. ఇక కాస్త బ్రేక్ తరువాత రెండో షెడ్యూల్ ని ప్రారంభించిన చిత్ర బృందం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు.

ఇటీవల్లే మహేష్ మహేష్ హాలిడే వెకేషన్ కి వెళ్లి వచ్చారు. ఆయన వచ్చేలోగా చిత్ర బృందం హైదరాబాద్‌లో పెద్ద సెట్‌ని నిర్మించారు. ఇక ఇప్పుడు ఆ సెట్ లోనే షూటింగ్ జరగబోతుంది. ఇదే టైమ్ లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈ సినిమాలో బడా స్టార్స్ నటిస్తున్నట్లు సమాచారం. పలు ఇండస్ట్రీల నుంచి నటీనటులను సెలెక్ట్ చేసారట. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ చెల్లెలి పాత్ర కోసం టాలీవుడ్ యంగ్ హీరోయిన్‌ని తీసుకున్నారట. అలానే వారిద్దరి మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ ఆ సినిమాకి హైలెట్ నిలుస్తాయని సమాచారం. ఇంతకీ మహేష్ చెల్లెలి పాత్రలో నటించే హీరోయిన్ మాత్రం ఎవరనేది ఇంకా తెలీదు.

ఈ సినిమాని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల ఇందులో హీరోయిన్లుగా చేస్తున్నారు. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, దీనికి ‘అర్జునుడు’, ‘అతడే పార్థు’ వంటి టైటిళ్లు పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

Share post:

Latest