వాటి మోజులో నెలకు లక్షలు ఖర్చు పెడుతున్న తాప్సి..!!

మంచు మనోజ్ , రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఝుమ్మంది నాదం సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ తాప్సీ. తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. హిందీలో వరస సినిమాలు చేస్తూ అక్కడే స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది .గత కొన్ని రోజుల క్రితం తన సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫోటోగ్రాఫర్లతో పలు వాగ్వాదాలు కూడా చేయడం జరిగింది తాప్సి.

Taapsee Pannu shares a glimpse of her intense workout for 'Rashmi Rocket' |  Hindi Movie News - Times of India
అయితే చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉన్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. తాను ప్రతినెల డైటీషియన్ కు లక్షల్లో ఖర్చు చేస్తున్నట్లుగా తెలియజేస్తోంది. ఈ విషయంలో తన తల్లిదండ్రులు ఎప్పుడూ తనని తిడుతూ ఉంటారని ప్రస్తుతం ఉన్న వృత్తిలో ఇలాంటివి ఖర్చు ఉండాల్సిందే అంటూ తెలుపుతోంది తాప్సి. ది లాలాన్ టాప్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సి తన వ్యక్తిగత విషయాలను సైతం తెలియజేయడం జరిగింది. తన తండ్రి ఎప్పుడు డబ్బు పొదుపు చేయాలంటుంటారని జీవితాంతం డబ్బు ఆదాచేసిన తనకోసం ఎలాంటి ఖర్చులు చేయారని తెలుపుతోంది.

Taapsee Pannu recalls about removing varicose veins | Hindi Movie News -  Times of India
డైటీషియన్ విషయంలో తన తల్లిదండ్రులు కోప్పడుతూ ఉంటారని ప్రతినెల అంత ఖర్చు చేయడం అవసరమా అంటూ యాంకర్ ప్రశ్నించగా కొన్ని సెకన్ల పాటు తడబడిన తాప్సి ఆ తర్వాత నెలకు దాదాపుగా లక్ష అని చెప్పడంతో ఆ ఆన్సర్ విన్నర్ నటిజన్స్ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం తాను సినీ రంగంలో ఉంటున్నానని తన జీవితంలో ఎక్కడ ఉన్నాను అనేదానిపై తన ఆహారం జీవనశైలి ఆధారపడి ఉంటుందని తెలుపుతోంది. ప్రతి నాలుగు సంవత్సరాలకు శరీరంలో పలుమార్పులు వస్తుంటాయని అలాగే అనేక నగరాలకు దేశాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎలాంటి ఆహారం తినాలో నిపుణుల సలహా తీసుకుంటానని తెలుపుతోంది తాప్సి.

Share post:

Latest