క్యాన్సర్ సంస్థను స్టార్ట్ చేయనున్న స్టార్ యాక్ట్రెస్.. తెగ పొగిడేస్తున్న ఫ్యాన్స్!!

తెలుగు మూవీ ఒకటవుదాం (2007)తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన హంసానందిని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు వంటి సినిమాల్లో లీడ్‌ రోల్‌లో చేసింది. మిర్చి సినిమాలో మిర్చి లాంటి కుర్రోడు పాటలో ఈ ముద్దుగుమ్మ తన అందాలను వలకబోస్తూ కుర్ర కారు మతి చెడగొట్టింది. రామయ్య వస్తావయ్య, అత్తారింటికి దారేది, లెజెండ్ వంటి చాలా సినిమాల్లోని ఐటెం సాంగ్స్ లోనూ నర్తించింది.

అయితే తెలుగులో బిజీ యాక్ట్రెస్ గా ఉంటున్న సమయంలోనే ఆమె బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బారిన పడింది. దాంతో సినిమాలు బంద్ చేయాల్సి వచ్చింది. క్యాన్సర్‌ను ఆమె అతి కష్టం మీద జయించింది. ఇప్పుడు తన జీవితాన్ని మళ్లీ కొత్తగా ఆరంభించింది. క్యాన్సర్ వ్యాధి బారిన పడిన తర్వాత భయం, గందరగోళం, ఆందోళనలు ఆమెలో విపరీతంగా పెరిగిపోయాయి కానీ వాటిని ఆమె మానసికంగా ఎదుర్కొంది. చాలా మనో నిబ్బరంతో చికిత్స చేయించుకొని ఈ జబ్బు నుంచి బయటపడింది.

నిజానికి హంసానందిని తల్లి యామిని కూడా బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడింది. దురదృష్టవశాత్తు ఈ జబ్బుకు ఆమె బలైపోయింది. టెస్ట్ రిజల్ట్స్ లో తనకు 3rd గ్రేడ్ క్యాన్సర్ ఉన్నట్లు హంసానందిని తెలుసుకుంది. తన తల్లిలాగే తను కూడా చనిపోవడం ఖాయమని మొదట బాగా బయటపడింది. తర్వాత భయాన్ని అధిగమించి మృత్యువును జయించింది. అయితే చనిపోయిన తన తల్లి పేరు గుర్తుగా ఒక క్యాన్సర్ సంస్థను ఇప్పుడు స్టార్ట్ చేయడానికి సిద్ధమైంది. హంసానందిని తన తల్లి పేరు మీద ‘యామిని కేన్సర్‌ ఫౌండేషన్‌’ నెలకొల్పనున్నది. తన తల్లి లాగా ఎవరూ చనిపోకూడదని ఉద్దేశంతోనే దీనిని స్టార్ట్ చేయనుంది. అలాగే సినిమాల్లో నటించడం కూడా పునఃప్రారంభించింది. ఫ్యాన్స్ ఆమె నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest