ప్రగ్యా జైస్వాల్ కి ఖరీదైన నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చిన స్టార్ హీరో..!!

ఈ మధ్యకాలంలో బాలయ్య పలు కమర్షియల్ యాడ్లలో కూడా చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటివరకు కెరియర్లో ఎన్నో చిత్రాలు నటించిన బాలయ్య ఎందుకో కమర్షియల్ యాడ్ విషయంలో మాత్రం ఎప్పుడు వెనకడుగు వేసేవారు.కానీ ఈమధ్య రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి ఒక యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మరొకసారి జువెలరీ సంస్థకు సంబంధించి ఒక యాడ్లో నటించారు. ఈ యాడ్ లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో కలిసి కనిపించడం జరిగింది. వేగ శ్రీ జ్యువెలరీ అండ్ డైమండ్ కి సంబంధించి ఒక యాడ్ ఫిలిం లో నటించారు. ఇటీవల షూటింగ్ కూడా జరిగింది అందుకు సంబంధించి విజువల్స్ సీన్స్ ని తాజాగా శ్రేయస్ మీడియా సంస్థ యూట్యూబ్ ద్వారా విడుదల చేయడం జరిగింది.

Balayya in super cool look సూపర్ కూల్ లుక్ లో బాలయ్య

నందమూరి బాలకృష్ణ వేగా జువెలరీస్ వేగ శ్రీ గోల్డెన్ డైమండ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ యాడ్ లో ప్రగ్యాకు బాలయ్య కాస్ట్ గిఫ్ట్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్ కలిసి అఖండ చిత్రంలో నటించారు. ఇద్దరి మధ్య వ్యత్యాసం చాలానా ఉన్న ఇద్దరు బాగానే నటించి ప్రశంసలు అందుకున్నారు. విడుదలైన మొదట్లోనే కలెక్షన్ల పరంగా బాగా ఆకట్టుకుంది ఈ నేపథ్యంలోనే యాడ్ ఫిలింలో కూడా వీరిద్దరూ జంట అయితే బాగుంటుందని ఉద్దేశంతోనే ఈ యాడ్ కోసం తీసుకున్నట్లుగా సమాచారం.

నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ పెళ్లి సీన్స్ లో కూడా కనిపించినట్లు తెలుస్తున్నది. ఈ యాడ్ ఫిలిం విడుదలయితే ఈ అంశం మీద పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108వ సినిమాలో నటిస్తున్నారు. ప్రగ్యా మాత్రం ఇంతవరకు తన తదుపరిచిత్రాన్ని ప్రకటించలేదు.

Share post:

Latest