గుండెల్లో గుబులు పుడుతోందంటున్న సింగర్ సునీత.. విషయం ఇదే!

ఈ మాటలన్నది మరెవరో కాదు, స్వయంగా సింగర్ సునీతనే ‘గుండెల్లో గుబులు పుడుతోంది’ అని అంది. అయితే ఆమె ఏ పరిస్థితుల్లో ఆ మాట అన్నదో తెలియాలంటే మీరు ఈ పూర్తి కధనాన్ని చదవాల్సిందే. చాలా కాలం తర్వాత టాలీవుడ్ టాలెంటెడ్ సినిమా డైరెక్టర్ కృష్ణవంశీ ‘రంగమార్తాండ” అనే సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి అందరికీ విదితమే. బ్రహ్మనందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తైన ఈ మూవీ ఉగాది కానుకగా ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దాంతో, ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం ఈ మూవీ స్పెషల్ షో వేయడం జరిగింది. దీనికి సినీ ప్రముఖులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ హాజరయ్యి సినిమా చూసిన తరువాత డైరెక్టర్ కృష్ణవంశీపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్పందిస్తూ.. రంగమార్తండ సినిమా చూస్తున్నంతసేపు తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని చెప్పడం మీరు చూసే వుంటారు. అదే విధంగా ఈ సినిమా చూసిన సింగర్ సునీత కూడా స్పందిస్తూ…. ఈ సినిమా చూస్తున్నంతసేపు తన గుండె బరువయిపోయిందని.. మనసంతా గుబులుగా ఉందని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందం వారి పెర్ఫ్మెన్స్ ని ఆమె కొనియాడారు. అలాంటి గొప్ప పెర్ఫామెన్స్ నటీనటుల నుంచి తీసుకురావడం డైరెక్టర్ కృష్ణవంశీ గారికే సాధ్యం అంటూ ఆకాశానికెత్తేశారు సింగర్ సునీత. ఈ నేపథ్యంలో ఆమె ప్రేక్షకులను ఉద్దేశిస్తూ… ఈ సినిమాలో మీ హృదయాన్ని కదిలించే సన్నివేశాలు చాలా ఉంటాయి… తప్పకుండా సినిమా చూసి తరించండి… అంటూ సునీత చెప్పుకొచ్చారు.

Share post:

Latest