నేను కూడా వేధింపులకు గురయ్యానంటున్న సింగర్ కౌసల్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సింగర్ దర్శకుడు చెక్రి దర్శకత్వంలో అత్యధిక పాటలు పాడింది సింగర్ కౌసల్య. అప్పట్లో ఈమె పాటలకు ఎంతోమంది వీరాభిమానులు ఉండేవారు.1999 లో తెలుగులో మొదటిసారి “నీ కోసం” అనే చిత్రం ద్వారా పాటలు పాడిన కౌసల్య ఆ తర్వాత దాదాపుగా 300లకు పైగా పాటలలో పాడి అలరించింది. అయితే తన కెరియర్ పరంగా బాగానే ఉంటున్న సమయంలో కౌసల్యాకి వైవాహిక జీవితం మాత్రం చాలా ఒడిదుడుకులకు గురయ్యేలా చేసిందట. వివాహం తరువాత కుటుంబ సభ్యుల కారణంగా చాలా బాధను అనుభవించానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరుగుతోంది.

కౌసల్య ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను గృహహింస సమస్యలు కారణంగా తన భర్త తనని ఎక్కువగా వేధిస్తూ ఉండే వారిని దీంతో అనేకసార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఇలా తమ వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న పలు ఇబ్బందుల గురించి తెలియజేసింది. తాను వైవాహిక జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానని అప్పట్లో తన బాబు చాలా చిన్న పిల్లవాడని వాడికి తండ్రి ప్రేమను దూరం చేయడం ఇష్టం లేకనే ఎన్నో బాధలను అనుభవించాలని తెలుపుతోంది కౌసల్య.

Kousalya Family Husband Biography Parents children's Marriage Photos
చివరికి తన భర్త మరొక వివాహం చేసుకోవాలనుకునే వరకు సర్దుకుపోయానని ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాబు ప్రస్తుతం పెద్దవాడు కావడం తో ప్రస్తుతానికి బాగానే ఉన్నానని తెలిపారు. కానీ తన కుమారుడు మాత్రం మళ్లీ వివాహం చేసుకోమని తనకి సలహా ఇస్తున్నట్లుగా తెలియజేస్తోంది కౌసల్య. అలాగే తన పుట్టినింటి గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది తన తండ్రి చిన్న వయసులోనే మరణించారని అమ్మ తనను పెంచి పెద్ద చేసిందని ఎనిమిది వేల క్రితం ఆమె కూడా మరణించిందని ఇప్పుడు తన కుమారుడే తనకు లోకమని తెలుపుతోంది.

Share post:

Latest