బుల్లి నిక్క‌ర్ లో బాక్సింగ్ అద‌ర‌గొట్టిన శృతిహాసన్.. వీడియో వైర‌ల్‌!

అందాల భామ శృతిహాసన్ వ‌రుస హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలతో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ కు జోడీగా `స‌లార్‌` మూవీ లో నటిస్తోంది.

ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం శ‌రవేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అలాగే `ది ఐ` మూవీతో శృతి హాస‌న్ హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉంటే శృతి హాస‌న్‌.. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. స్లిమ్ అండ్ ఫిట్ ఫిగర్ మైంటైన్ చేసేందుకు శృతి హాస‌న్ ఎంత క‌ష్ట‌ప‌డుతుందో ఈ వీడియోలో చూడ‌వ‌చ్చు.

బుల్లి నిక్క‌ర్ ధ‌రించి బాక్సింగ్ అద‌ర‌గొట్టింది. ప్రొఫెషనల్ ట్రైనర్ ఇర్ఫాన్ ఖాన్ పర్యవేక్షణలో కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు శృతి కామెంట్ చేసింది. అలాగే చాలా గ్యాప్ తర్వాత ట్రైనింగ్ తీసుకుంటునట్లు వెల్లడించింది. ప్ర‌స్తుతం శ్రుతి హాస‌న్ బాక్సింగ్ వీడియో మాత్రం అంద‌రినీ ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్ గా మారింది.

https://www.instagram.com/reel/CpmyKhDBMBV/?utm_source=ig_web_copy_link

Share post:

Latest