అలా చేయడం కూడా వేధింపులతో సమానం అంటున్న సాయి పల్లవి..!

టాలీవుడ్ లో హీరోయిన్ సాయి పల్లవి అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది అచ్చ తెలుగు అమ్మాయిని చెబుతూ ఉంటారు. ఇక సినిమాలో ఈమె చెప్పే డైలాగులు సైతం సినిమాకు హైలైట్ గా నిలుస్తూ ఉంటాయి. మలయాళ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ ఫిదా సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరిపోయింది. మేకప్ వేసుకోకుండానే తన అందంతో అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సాయి పల్లవి.

Sai Pallavi talks about physical, verbal abuse as she opens up on MeToo  movement - Hindustan Times

అయితే తాజాగా ఈమె నిజం విత్ స్మిత అనే టాక్ షో కి గెస్ట్ గా రావడం జరిగింది. ఇందులో మీటూ ఉద్యమం పైన స్పందించి పలు ఆసక్తికరమైన కామెంట్లు చేయడం జరిగింది.. చేతులతోనే కాదు మాటలతో ఎదుటి వ్యక్తిని ఇబ్బంది కలిగించేలా చేసిన అది వేధింపులతోనే సమానమంటూ తన అభిప్రాయంగా తెలిపింది. అందుకు సంబంధించి ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది .అయితే సాయి పల్లవి మొదటిసారి ఇలా మీటు ఉద్యమం పై స్పందించడంతో ఈ ప్రోమో తెగ వైరల్ గా మారుతోంది. కేవలం మీటుపైన కాకుండా సాయి పల్లవి తన కెరీర్లు తగిలిన కొన్ని ఎదురుదెబ్బల గురించి కూడా ఇందులో తెలియజేసింది .ఎన్టీఆర్ ,అల్లు అర్జున్, రామ్ చరణ్ ఈ ముగ్గురిలో ఎవరి డాన్స్ బాగా ఇష్టమని అడగగా..

నాకు ఈ ముగ్గురు హీరోలతో కలిసి ఒక పాట చేస్తే బాగుంటుందని నవ్వుతూ తెలియజేసింది. సాయి పల్లవి గత ఏడాది విరాటపర్వం సినిమాతో పర్వాలేదు అనిపించుకుంది. ఇక గార్గి సినిమాతో మిశ్రమ స్పందన అందుకుంది. అయితే ఆ తర్వాత ఎలాంటి సినిమాలను చేయలేదు ఈ ముద్దుగుమ్మ.<
/p>

Share post:

Latest