ఆ క్ష‌ణం బాధ భ‌రించ‌లేక ఏడ్చేశా.. రితికా సింగ్ షాకింగ్ అనుభ‌వాలు!

`గురు` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన అందాల భామ రితికా సింగ్‌.. నేడు `ఇన్ కార్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. హర్ష్ వర్ధన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో రితికా ప్ర‌ధాన పాత్ర‌ను పోషించింది. మనీష్ ఝాంజోలియా, సందీప్ గోయల్, సునీల్ సోని, గ్యాన్ ప్రకాష్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

య‌థార్థ సంఘ‌ట‌న ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని అంజుమ్ ఖురేషి, సాజిద్ ఖురేషి సంయుక్తంగా నిర్మించారు. నేడు ఐదు భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కాగా.. మిశ్ర‌మ స్పంద‌న ల‌భించింది. ఇక‌పోతే ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రితికా.. షూటింగ్ స‌మ‌యంలో త‌న‌కు ఎదురైన షాకింగ్ అనుభ‌వాల‌ను పంచుకుంది.

 

రితికా మాట్లాడుతూ.. `ఈ సినిమా అంతా ఒకే రోజులో జరిగే కథ‌. ఓ అమ్మాయిని సాయంత్రం కిడ్నాప్ చేస్తారు. రాత్రి సమయాన్నికల్లా తనకు ఏం జరిగింది..? కిడ్నాపర్ల నుంచి ఆమె బయటపడిందా.. లేదా..? అనేది కథ‌. నేను సినిమా ప్రారంభంలో ఏ కాస్ట్యూమ్స్ అయితే వెసుకున్నానో చివరి వరకు అవే కొనసాగించాలి. నా పాత్రకు ఎంతో కనెక్ట్ అయ్యాను. మ‌రెంతో క‌ష్ట‌ప‌డ్డాను కూడా. ఇక‌ ఒక సీన్ అయ్యాక దర్శకుడు చెప్పగానే బాగా ఏడ్చేశా. ఎందుకంటే ఆ సన్నివేశంలో నా పాత్రను అంద‌రూ ఘోరంగా తిడతారు. ఆ క్షణం బాధను భరించలేక ఏడ్చేశా. అది నాకు చాలా కష్టంగా అనిపించింది` అంటూ చెప్పుకొచ్చింది.

Share post:

Latest