కుడి కన్ను క‌నిపించ‌దు.. కిడ్నీ చెడిపోయింది.. రానా క‌ష్టాలు వింటే క‌న్నీళ్లాగవు!

రానా ద‌గ్గుబాటి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న‌టువంటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్రత్యేక‌మైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. విల‌క్ష‌ణ న‌టుడుగా గుర్తింపు పొందాడు. మోస్ట్ టాలెంటెడ్ యాక్ట‌ర్ అయిన రానా నిజానికి టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక‌డిగా ఉండాల్సింది. కానీ, ఆ హోదాను ఆయ‌న పొంద‌లేక‌పోయారు.

అందుకు కార‌ణం ఆయ‌న అనారోగ్య స‌మ‌స్య‌లే అన‌డంలో సందేహం లేదు. లైఫ్ లో రానా ప‌డ్డ క‌ష్టాలు వింటే క‌న్నీళ్లాగ‌వు. అవును, ఆరోగ్యపరంగా ఆయ‌న ఎన్నో ఇబ్బందులు ప‌డ్డారు. మ‌రెన్నో స‌వాళ్లను ఎదుర్కొన్నారు. `రానా నాయుడు` ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న రానా.. తొలిసారి త‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌పై స్పందించాడు. కార్నియల్ మరియు కిడ్నీ అనే రెండు ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు త‌న‌కు జ‌రిగాయ‌ని రానా బ‌య‌ట‌పెట్టారు.

`చిన్నత‌నం నుంచి నాకు కుడి కన్ను క‌నిపించ‌దు. అందుకే కుడి కన్నుకు ఆపరేషన్ చేశారు. కొన్నాళ్ల క్రితం కిడ్నీ చెడిపోవ‌డంతో కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. రెండింటికీ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఈ విషయంలో నేను టెర్నినేటర్‏ని అనుకుంటున్నాను. ఇక నాకు చిన్పప్పటి నుంచీ బీపీ ఉంది. దీంతో గుండె సంబంధిత సమస్య కూడా వచ్చింది. చాలా మంది శారీరక సమస్యలు వస్తే బాధపడుతుంటారు. కొన్నాళ్లకు ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అయనా ఫీల్ అవుతూనే ఉంటారు. కానీ, ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ నేను నా ధైర్యాన్ని కోల్పోలేదు. అదే ఇప్పటి వరకూ న‌న్ను కాపాడింది` అంటూ రానా చెప్పుకొచ్చారు.