దేశం మీసం మెలేసిన రాజ‌మౌళి నెక్స్ట్ టార్టెట్ అదేనా?

95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలలో ఈసారి తెలుగు సినిమా `ఆర్ఆర్ఆర్‌` సత్తా చాటి చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ కైవలం చేసుకుంది. ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుని గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందానికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవాడ్డు ద‌క్క‌డంతో కోట్ల మంది భారతీయుల హృదయాలు గర్వంతో ఉప్పొంగిపోతున్నాయి. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిన విజయమిది. అయితే ఆస్కార్ ను అందుకోవ‌డం వెన‌క రాజ‌మౌళి ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. అమెరికాలోనే చాలా రోజులపాటు తిష్ట వేసి.. తనకున్న మార్కెటింగ్ టెక్నిక్ మొత్తం ఉపయోగించాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చినప్పుడే చాలామంది ఆస్కార్ రాదని తేల్చేశారు.

కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆస్కార్ ను సాధించారు. దేశం మీసం మెలేశాడు. ఇక రాజ‌మౌళి నెక్స్ట్ టార్గెట్ ఆస్కార్ అవార్డు లిస్టులో ది బెస్ట్ డైరెక్టర్ పురస్కారం అందుకోవ‌డ‌మే అని ఇన్‌సైడ్ టాక్ న‌డుస్తోంది. సరైన ప్లానింగ్ ఉండాలే గానీ ఏదైనా సాధ్య‌మే అని రాజ‌మౌళి ఇప్ప‌టికే ఎన్నో సార్లు నిరూపించి చూపించారు. అటువంటి ఆయ‌న‌కు ది బెస్ట్ డైరెక్టర్ పురస్కారం అందుకోవ‌డం అంత క‌ష్ట‌మైన ప‌నేమి కాద‌నే చెప్ప‌వ‌చ్చు. కాగా, రాజ‌మౌళి త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ను సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

Share post:

Latest