ప్రత్తిపాడులో కొత్త ఇంచార్జ్..రాజాని రీప్లేస్ చేస్తారా?

ప్రత్తిపాడు టి‌డి‌పి ఇంచార్జ్ వరుపుల రాజా..హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న రాజా..ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారం చేసి అలసటకు గురైన రాజాకు సడన్ గా గుండెపోటు రావడంతో..హాస్పిటల్ కు తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇక రాజా మృతితో ప్రత్తిపాడులో టి‌డి‌పికి కొత్త నాయకుడు అవసరం పడింది.

అసలు రాజా ప్రత్తిపాడు టి‌డి‌పి ఇంచార్జ్ గా ఉంటూ అక్కడ పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన స్వల్ప మెజారిటీ తేడాతోనే ఓడిపోయారు. ఓడిపోయాక కొన్ని రోజులు పార్టీకి దూరమయ్యారు. కానీ మల్లి వెంటనే పార్టీలో యాక్టివ్ అయ్యి..ప్రత్తిపాడు ఇంచార్జ్ గా ఉంటూ..పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య ఉన్నా సరే గట్టిగా పోరాడుతూ వచ్చారు. అక్రమ కేసులని ఎదురుకున్నారు. ఇక ప్రత్తిపాడులో రాజా గెలుపు అవకాశాలు పెరుగుతున్నాయని సర్వేలు కూడా వస్తున్నాయి.

నెక్స్ట్ ఎన్నికల్లో రాజా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి గెలవడం ఖాయమనే తరుణంలో..ఆయన హఠాత్తుగా మరణించడం టి‌డి‌పికి పెద్ద లోటు అని చెప్పాలి. ఇప్పుడు ఆయన్ని రీప్లేస్ చేసే నాయకుడుని వెతకాలి. అయితే ప్రత్తిపాడు సీటుని రాజా ఫ్యామిలీలో ఎవరికైనా ఇస్తారా? లేక కొత్త నేతని బరిలో దించుతారా? అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఇంకా ప్రత్తిపాడుపై చర్చలు జరగడం లేదు.

కొన్ని రోజులు పోయాక ప్రత్తిపాడు సీటు గురించి చంద్రబాబు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆ సీటుని రాజా ఫ్యామిలీకి కేటాయిస్తారో? లేక వేరే నాయకుడుకు ఇస్తారో చూడాలి.

Share post:

Latest