పరిటాల ఫ్యామిలీకి రెండుచోట్ల షాక్..కష్టపడాల్సిందే!

వచ్చే ఎన్నికల్లో రెండుసీట్లలో పోటీ చేయాలని పరిటాల ఫ్యామిలీ చూస్తున్న విషయం తెలిసిందే. రాప్తాడుతో పాటు ధర్మవరం బరిలో దిగాలని చూస్తున్నారు. రాప్తాడులో పరిటాల సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో రాప్తాడులో శ్రీరామ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాప్తాడుతో పాటు ధర్మవరం బాధ్యతలు చూసుకుంటున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ రెండు సీట్లు తమకే కావాలని పరిటాల ఫ్యామిలీ డిమాండ్ చేస్తుంది.

దాదాపు రెండు సీట్లు పరిటాల ఫ్యామిలీకి దక్కే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే గెలుపే చాలా కష్టమయ్యేలా ఉంది. రెండుచోట్ల పరిటాల ఫ్యామిలీ కాస్త టఫ్ ఫైట్ ఎదురుకుంటుంది. రెండు చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ గా ఉన్నారు. దీంతో పరిటాల ఫ్యామిలీకి ఒక్క చోట కూడా పట్టు దొరుకుతున్నట్లు కనిపించడం లేదు. కొద్దో గొప్పో రాప్తాడులో పర్లేదు..కానీ అక్కడ లీడ్ వైసీపీకే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ఆత్మసాక్షి సర్వేలో రెండు చోట్ల వైసీపీ గెలుస్తుందని తేలింది.

ఉమ్మడి అనంతపురంలో 14 సీట్లు ఉంటే టి‌డి‌పి..కదిరి, అనంతపురం అర్బన్, హిందూపురం, ఉరవకొండ, కళ్యాణదుర్గం, పెనుకొండ, తాడిపత్రి సీట్లలో గెలుస్తుందని, వైసీపీ వచ్చి..రాయదుర్గం, మడకశిర, గుంతకల్లు, పుట్టపర్తి, ధర్మవరం, రాప్తాడుల్లో గెలుస్తుందని, శింగనమలలో టఫ్ ఫైట్ ఉందని తేల్చి చెప్పింది.

అంటే జిల్లాలో వైసీపీ-టి‌డి‌పిల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. అయితే పరిటాల ఫ్యామిలీ చూసుకుంటున్న ధర్మవరం, రాప్తాడుల్లో వైసీపీ గెలవడం, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్ రెడ్డి లాంటి సీనియర్లు ఇంచార్జ్ లుగా ఉన్న రాయదుర్గం, పుట్టపర్తిల్లో సైతం వైసీపీ గెలవడం టి‌డి‌పికి పెద్ద షాక్ ఇచ్చే అంశమని  చెప్పవచ్చు.

Share post:

Latest