కళ్ళు చెదిరే రేంజ్ లో వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిన ఎన్టీఆర్..!!

స్వర్గీయ నందమూరి హరికృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాల రామాయణం సినిమాతో తన నటనను ప్రూవ్ చేసుకున్న ఈయన.. ఆ తర్వాత కాలంలో పలు సినిమాలలో చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక హీరోగా మారిన తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపున సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరొకవైపు టీవీ షోలు కూడా చేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టారు. మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీకే పరిమితమైన ఎన్టీఆర్ ఖ్యాతి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎల్లలు దాటిందని చెప్పాలి. త్వరలోనే ఆస్కార్ స్టేజ్ పై కూడా లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నారు.. దీన్ని బట్టి చూస్తే ఏ రేంజ్ లో ఆయన పాపులారిటీ దక్కించుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

Jr NTR's Rs 25 Crore luxurious Hyderabad bungalow: 18 photos and videos  that take you inside the actor's abode | GQ India

ఇకపోతే మార్చి 12వ తేదీన అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో నిర్వహించే 95 వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ పాల్గొనబోతుండడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా మరొకసారి హాట్ టాపిక్ గా మారుతూ ఉండడం గమనార్హం.. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.45 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ మరొకవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూనే.. బిగ్ బాస్, మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి షోలకి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

మొత్తంగా ఆయన ఆస్తుల విలువ సుమారుగా రూ.450 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ప్రతినెల రూ.3 కోట్లకు పైగా ఆయనకు ఆదాయం వివిధ మార్గాల ద్వారా లభిస్తోందని సమాచారం.. అత్యంత విలువైన లగ్జరీకార్లు, ఫ్లాట్లు ఆయన సొంతం. ఇక లక్ష్మీ ప్రణతిని వివాహం చేసుకున్న తర్వాత ఈయనకు ఇద్దరు కొడుకులు జన్మించారు. అలాగే భార్య నుంచి కూడా కొన్ని కోట్ల ఆస్తి కట్నం కింద లభించింది. మొత్తానికి అయితే ఎన్టీఆర్ బాగానే కూడబెట్టారని చెప్పవచ్చు.

Share post:

Latest