సొంత అక్క కొడుకు ఎంగేజ్మెంట్ కు దూరంగా ఎన్టీఆర్‌.. కార‌ణం అదేనా?

నంద‌మూరి కుటుంబంలో తాజాగా ఓ శుభ‌కార్యం జ‌రిగింది. దివంగ‌త న‌టుడు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఇంట పెళ్లి సందడి నెలకొంది. సుహాసిని కుమారుడు వెంకట శ్రీహర్ష త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడు. తాజాగా ఎంగేజ్మెంట్ అట్ట‌హాసంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగిన శ్రీహర్ష ఎంగేజ్మెంట్ కు నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

సుహాసిని సోద‌రుడు నందమూరి క‌ళ్యాణ్ రామ్ కుటుంబ‌సమేతంగా వెళ్లి కాబోయే వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వించాడు. మ‌రొక సోద‌రుడు దివంగత జానకిరామ్ భార్య పిల్లలు సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. కానీ, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాత్రం క‌నిపించ‌లేదు. సొంత అక్క కొడుకు ఎంగేజ్మెంట్ కు ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు. ఆస్కార్ వేడుక ముగించుకుని మంగళవారం ఎన్టీఆర్ హైద‌రాబాద్ కు వ‌చ్చారు.

అయితే కొన్ని వ్య‌క్తిగ‌త‌ ప‌నుల‌తో చాలా బిజీగా ఉండ‌టం వ‌ల్లే శ్రీహర్ష ఎంగేజ్మెంట్ కు వెళ్ల‌లేద‌ని అంటున్నారు. మ‌రోవైపు నంద‌మూరి కుటుంబంతో ఉన్న విభేదాల వ‌ల్లే ఎన్టీఆర్ ఈ వేడుక‌కు హాజ‌రు కాలేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా, హరికృష్ణకు ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య సంతానం సుహాసిని, జానకిరామ్, కళ్యాణ్ రామ్. రెండో భార్య షాలినికి ఎన్టీఆర్ జ‌న్మించారు. ఎన్టీఆర్ తో నంద‌మూరి కుటుంబస‌భ్యులెవ్వ‌రికీ స‌ఖ్య‌త లేదు. కేవ‌లం క‌ళ్యాణ్ రామ్ కు మాత్ర‌మే ఎన్టీఆర్ తో హెల్తీ రిలేషన్స్ ఉన్నాయి. త‌మ్ముడికి ప్ర‌తి విష‌యంలోనూ క‌ళ్యాణ్ రామ్ అండ‌గా ఉంటారు.

Share post:

Latest