మనోజ్ పెళ్లిలో మనోజ్ కంటే హైలెట్ గా మారిన నరేష్- పవిత్ర.. వీడియో వైరల్..!!

తెలుగు సినీ పరిశ్రమలో నటుడు మోహన్ బాబుకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన కొడుకు మనోజ్ మార్చి 3వ తేదీన రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక మనోజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనిక రెడ్డి. హైదరాబాద్లో ఫిలింనగర్ లో ఉన్న మంచు లక్ష్మీ నివాసంలో మౌనిక, మనోజ్ ల పెళ్లి కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి మంచు లక్ష్మి తానై దగ్గరుండి నడిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. మనోజ్, మౌనికల పెళ్లికి మోహన్ బాబు రారు అనుకున్నారు కానీ వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.

Naresh and Pavitra Lokesh Exclusive Visuals | Manchu Manoj and Bhuma  Mounika Reddy | Filmyfocus.com - YouTube

వీరి పెళ్లి వేడుకకు సినీ పరిశ్రమ నుండి అతి తక్కువ మంది మాత్రమే హాజరయ్యారు. అందులో నటుడు నరేష్, పవిత్ర లోకేష్ హాజరయ్యారు. ఈ జంట కొంతకాలంగా సహజీవనం వార్తలు వినిపించాయి. నరేష్ భార్య రమ్య రఘుపతి విడాకులు ఇవ్వటానికి అంగీకరించకపోవడంతో నరేష్ కి నాలుగో పెళ్లి చేసుకునే వీలు లేకుండా పోయింది. ఇప్పుడు మనోజ్ పెళ్లికి హాజరైన ఈ జంట ఫోటోలు, వీడియోలో మీరు కూడా హైలెట్ అయ్యారు.

గతేడాది అది చివర్లో కృష్ణ అతని భార్య మరణిస్తే వీళ్ళు అక్కడ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో ఎక్కడ ఏ వేడుక జరిగినా వీళ్ళ జంటగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మనోజ్ పెళ్లికి హాజరయ్యి హైలెట్ అయ్యారు. అందుకే సోషల్ మీడియాలో నెటిజన్లు ఎక్కడ చూసినా ఏ వేడుకల్లో చూసిన వీరి ఎంట్రీ ఏందిరా బాబు అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

Share post:

Latest