ఎట్టకేలకు ఒక ఇంటివాడైన నాగ చైతన్య..?

అక్కినేని నాగచైతన్య ఇటీవల కాలంలో ఎలాంటి చిత్రాలు చేసినా కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోతున్నాయి. ఇక కమర్షియల్ పాయింట్ ను ఏమాత్రం చూపించలేకపోతున్నారు. లవ్ స్టోరీ సినిమాతో ఊర మాస్ కథలని కూడా ట్రై చేశారు . ఆ తర్వాత నటించిన సినిమాలు ఏవి పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో తాజాగా కస్టడీ వంటి యాక్షన్ సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఫ్లాట్ నుంచి నాగచైతన్య బయటకు రావడం జరిగింది.

మురళీమోహన్ ఆయన కుమారులు ఒకేచోట ఉండాలని ప్రత్యేకంగా ఒక అపార్ట్మెంట్ ను కూడా నిర్మించుకోవడం జరిగింది. ఒక రోజు నాగచైతన్య అపార్ట్మెంట్లోని ఒక ఫ్లాట్ ను చూసి చాలా ఇష్టపడి దానిని భారీ ధరకు కొనుగోలు చేశారట. ఆ తర్వాత సమంతతో ఆ ఇంట్లో కొద్దిరోజులు కాపురం కూడా చేసినట్లు తెలుస్తోంది. కానీ ఆ తర్వాత మళ్లీ అతను ఆ ఫ్లాట్ నుంచి బయటికి వచ్చేసాడు అయితే సమంత మాత్రం ఆ ఇంటిని వదిలేయలేదు . మళ్లీ ఆమె ప్రత్యేకంగా ఆ ఇంటిని కొనుగోలు చేసిందని తెలిపారు.

ఇక ఇప్పుడు నాగచైతన్య ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత హోటల్స్ లో ఉంటూ సినిమా షూటింగ్లకు హాజరయ్యేవారు. అయితే ఇప్పుడు మాత్రం చైతన్య ప్రత్యేకంగా ఒక ఇల్లును కట్టుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా అక్కినేని నాగార్జున ఇంటికి చాలా దూరంగా ఉండి ఒక ల్యాండ్లో భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని నెలలు క్రితం కన్స్ట్రక్షన్ మొదలయ్యిందని ఇక మొత్తానికి అది పూర్తి అయ్యిందని పది రోజుల క్రితమే నాగచైతన్య ఆ ఇంట్లోకి వెళ్లాడని వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తిగా ఇష్టంతోనే నాగచైతన్య ఇంటిని డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎట్టకేలకు ఈ హీరో ఒక ఇంటివాడయ్యాడని అభిమానులు తెలియజేస్తున్నారు

Share post:

Latest