ఎంపీ సీట్లలో టీడీపీ ఖాళీ..కొత్త అభ్యర్ధులు రంగంలోకి!

ఎన్నికలకు ఇంకా ఏడాది పైనే సమయం ఉండగానే..ఇప్పటినుంచే టి‌డి‌పి అధినేత చంద్రబాబు..పలు స్థానాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా ఎన్నికల సమయంలో అభ్యర్ధులని ఫిక్స్ చేయకుండా..ముందు నుంచే అభ్యర్ధులని ప్రకటించి సత్తా చాటాలనేది చంద్రబాబు స్కెచ్..అయితే ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేశారు..ఇంకా కొన్ని చోట్ల అభ్యర్ధులని ఖరారు చేయాలి.

అయితే ఎమ్మెల్యేల సీట్లతో పాటు ఎంపీ సీట్లని ఫిక్స్ చేయాల్సి ఉంది. గత ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లకు కేవలం 3 సీట్లు మాత్రమే టి‌డి‌పి గెలిచింది. శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు స్థానాలని టి‌డి‌పి గెలుచుకుంది. ఇక ముగ్గురు సిట్టింగ్ ఎంపీలని పక్కన పెడితే…మిగిలిన సీట్లలో టీడీపీ అభ్యర్ధులని ఖరారు చేయాలి. గత ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు నేతలు పార్టీలు మారిపోయారు..కొందరు రాజకీయాలని నుంచి సైది అయ్యారు. దీంతో కొన్ని స్థానాల్లో కొత్త అభ్యర్ధులు కావాలి. శ్రీకాకుళంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు..ఇటు విజయనగరంలో అశోక్ గజపతి రాజు ఉన్నారు. విశాఖలో బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ ఉన్నారు.

కానీ అనకాపల్లి, అరకు, కాకినాడ, రాజమండ్రి, నరసాపురం స్థానాల్లో ఇంకా అభ్యర్ధులు ఫిక్స్ కాలేదు. ఈ సీట్లు ఎవరికి ఇస్తారో క్లారిటీ లేదు. విజయవాడలో కేశినేని నాని ఉండగా, మచిలీపట్నంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఉన్నారు. గుంటూరులో సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ ఉండగా, నరసారావుపేట, బాపట్లలో అభ్యర్ధులు ఫిక్స్ కాలేదు.

అటు ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి సీట్లలో ఎవరు పోటీ చేస్తారో ఇంకా తేలలేదు. అనంతపురంలో జేసీ పవన్ ఉండగా, హిందూపురంలో నిమ్మల కిష్టప్ప ఉన్నారు. కర్నూలులో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, నంద్యాలలో మాండ్ర శివానందరెడ్డి, రాజంపేటలో గంటా నరహరి, కడపలో శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. అంటే కొన్ని సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.

Share post:

Latest