విడాకులకు సిద్ధమైన మెగా డాటర్..?

టాలీవుడ్ లో మెగా కుటుంబానికి ఎంతటి ప్రత్యేకమైన స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కేవలం మెగా కుటుంబం అంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏమిటంటే.. వీరి కుటుంబంలో ఒకరే ఎక్కువ వివాహాలు చేసుకోవడం వల్ల ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చిరంజీవి కూతురు శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకోవడంతో ఎన్నోసార్లు ట్రోల్ అయినా సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరొకరు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.

Niharika Konidela prefers a Destination Wedding!

మెగాస్టార్ కూతురు శ్రీజ రెండవ భర్త కళ్యాణ్తో దూరంగా ఉంటున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని దాన్ని కూడా అధికారికంగా ప్రకటించకపోయిన.. ఒకరినొకరు కలిసి లేరని విషయం ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పుడు తాజాగా నాగబాబు కూతురు నిహారిక తన భర్త చైతన్య నుంచీ విడిపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని సినిమాలలో నిహారిక హీరోయిన్గా కూడా నటించింది కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. నిహారిక ,చైతన్యను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు. అలా వివాహమైన తర్వాత నిహారిక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది

నిహారిక వెబ్ సిరీస్ లకు, యూట్యూబ్ లో చిన్న చిత్రాలలో నిర్మాతగా వ్యవహరించింది.. నిహారిక ఒకసారి పబ్బులో దొరికిన సంగతి తెలిసిందే..అప్పుడే నిహారిక, చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు ఎక్కువగా వినిపించాయి.కానీ ఈ వార్తలు నిజం కాదని తేలిపోయింది. ఇప్పుడు మాత్రం కచ్చితంగా ఈ విషయం నిజమే అంటూ తెలుస్తోంది.. ఈ వార్తకు బలం చేకూరడానికి ముఖ్య కారణం నిహారిక ఇంస్టాగ్రామ్ లో తన భర్త చైతన్యాలు అన్ ఫాలో కావడం అలాగే చైతన్య కూడా నిహారికను అన్ ఫాలో అవ్వడం.. అలాగే వీరిద్దరికి సంబంధించిన ఫోటోలను కూడా డిలీట్ చేసినట్లుగా సమాచారం. మరి ఈ విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వస్తుందేమో చూడాలి మరి.

Share post:

Latest