యాక్టింగ్ కంటే పెళ్లే ముఖ్యం.. ఇంటర్వ్యూలో నమ్రత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

మాజీ మిస్ ఇండియా, నటి, వ్యాపారవేత్త, సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తాజాగా తన జీవితం, కెరీర్, తల్లి గురించి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన తల్లిదండ్రులు తనకు స్వతంత్రంగా ఉండటం, సామాజిక ఒత్తిళ్లను అధిగమించడం నేర్పించారని చెప్పారు. అలానే తాను కూడా తన పిల్లలలో కూడా అదే విలువలను పెంచుతున్నానని వివరించారు.

నమ్రత మహేష్‌ను పెళ్లి చేసుకోకముందు హిందీ, తెలుగు చిత్రాలలో నటించారు. ప్రస్తుతం ఆమె తమ బిజినెస్‌లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు చూసుకోవడానికి పరిమితమయ్యారు. ఇక పిల్లలను ఇంటికి రెప్పలా కాపాడుతూ మహేష్ బాబుని కూడా చూసుకుంటున్నారు. ఇక నమ్రతని పని, తల్లి బాధ్యతను బ్యాలెన్సింగ్ చేయడం గురించి అడిగినప్పుడు, అది ఒక సవాల్‌ అని పేర్కొన్నారు. అయితే ఆమె తన పనులకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, తన జీవితంలోని రెండు అంశాలను బ్యాలన్స్ చేసుకోవడం నేర్చుకున్నట్లు చెప్పారు.

ఇదే ఇంటర్వ్యూలో ఆమె తెలిపిన వివరాల ప్రకారం నమ్రత ఎప్పుడూ తన అమ్మమ్మను చూస్తూ పెరిగింది. మరాఠీ సినిమాలో తన అమ్మమ్మ యాక్ట్ చేసింది. ఆమె విమర్శల నేపథ్యంలో అప్పటి నమ్మకాలు, కట్టుబాట్లను దాటి మరీ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ధైర్యం చేసింది. ఆమె తనకు స్పూర్తిని ఇచ్చిందని నమ్రత చెప్పుకొచ్చారు.

మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నమ్రత అన్ని సమయాలలో వినయంగా, స్థిరంగా ఉండటం చాలా ముఖ్యమని నమ్ముతారు. ఆమె తన పిల్లలలో అదే విలువలను పెంపొందిస్తున్నారు. ప్రతి స్త్రీ తన జీవిత నిర్ణయాలలో సామాజిక ఒత్తిడిని అనుభవిస్తుంది. అయితే నమ్రత నటనకు స్వస్తి చెప్పాలనే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతం. ఆమె తన నిర్ణయం తీసుకోవడంలో ఎవరి అభిప్రాయాన్ని తీసుకోలేదు. ఫ్యామిలీ లైఫ్ గడపాలని పెళ్లే తనకు ముఖ్యమని యాక్టింగ్ కెరీర్‌ని తృణప్రాయంగా వదిలేసింది. మళ్ళీ సినిమాలో ఛాన్స్ వస్తే ఆమె తన యాక్టింగ్ కెరీర్ కంటే తన పెళ్లి లైఫ్ ని ఎంచుకుంటానని ఆమె తెలిపిపారు. నమ్రత ఎప్పుడూ స్వతంత్రంగా, దృఢంగా ఉండే మహిళ. ఆమె సవాళ్లను అధిగమించి, తనకు తానుగా నిజాయితీగా ఉండాలని నమ్ముతుంది.