పెద్దిరెడ్డి అడ్డాలో లోకేష్..టీడీపీకి కష్టమే!

ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు..గతంలో కాంగ్రెస్..ఇప్పుడు వైసీపీలో తిరుగులేని నేతగా ఎదుగుతూ వచ్చిన నాయకుడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి అనుకున్న మేర హైలైట్ కాలేదు గాని..ఎప్పుడైతే వైసీపీలోకి వచ్చారో అప్పటినుంచి ఆయన హవా మొదలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇంకా ఆయనకు పట్టు పెరిగింది. వైసీపీలో టాప్ లీడర్లలో ఒకరిగా ఉన్న పరిస్తితి.

ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈయన చేతుల్లోనే ఉంది..అక్కడ రాజకీయాలని ఈయనే డిసైడ్ చేస్తున్నారు. జిల్లాని వైసీపీ కంచుకోటగా చేయడానికి ఆయన పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 14కి 13 సీట్లు వైసీపీ గెలుచుకుంది. ఒక కుప్పంలో మాత్రమే ఓడిపోయింది. ఇప్పుడు కుప్పంపై కూడా ఫోకస్ పెట్టారు. కుప్పంలో పెద్దిరెడ్డి ఎలాంటి రాజకీయం చేస్తున్నారో తెలిసిందే. అక్కడ చంద్రబాబుని ఓడించాలని చూస్తున్నారు. దీంతో చంద్రబాబు కూడా రివర్స్ ఆపరేషన్ మొదలుపెట్టారు. పెద్దిరెడ్డిని పుంగనూరులో ఓడించాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా లోకేష్ పాదయాత్ర పుంగనూరులో కొనసాగుతుంది.

అక్కడ లోకేష్ పాదయాత్రకు మంచి స్పందనే వస్తుంది. తాజాగా జరిగిన సభలో లోకేష్..పెద్దిరెడ్డిని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.10 వేల కోట్లను దోచుకున్నాడని,  నియోజకవర్గంలో ఎవరు క్వారీ నిర్వహించుకోవాలన్నా పెద్దిరెడ్డికి 50 శాతం కమీషన్‌ ఇవ్వాలన్నారు. ఒక నియోజకవర్గంలో రూ.50 కోట్లు, జిల్లా వ్యాప్తంగా రూ.500 కోట్లను సంపాదించుకున్నారని ఆరోపించారు.

ఏదేమైనా పెద్దిరెడ్డిని నెక్స్ట్ ఎన్నికల్లో ఓడించి తీరతామని లోకేష్ అంటున్నారు. కానీ అనుకున్న విధంగా పుంగనూరులో పెద్దిరెడ్డికి చెక్ పెట్టడం సాధ్యమయ్యే పని కాదు..ఆయనని ఓడించడం అంత సులువు కాదు.