పెళ్లి విషయంలో నేను అదృష్టవంతురాలి అంటున్న లావణ్య త్రిపాఠి..!!

టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల రాక్షసి చిత్రం ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది.అయితే అదృష్టం కలిసి రాలేకపోవడంతో స్టార్ హీరోల సరసన నటించలేకపోతోంది.అయినా కూడా దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో నెట్టుకొస్తూనే ఉంది. సోషల్ మీడియాలో కూడా తన అందచందాలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది.

Pics: Lavanya Tripathi turns the heat up by posing in a car | Telugu Movie  News - Times of India
తాజాగా పులిమేక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా గత కొన్ని రోజులుగా మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూనే ఉన్నది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వడం జరిగింది. 2023లో కచ్చితంగా లావణ్య త్రిపాఠి వివాహం ఉంటుందని గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతోంది ఇంకా కూడా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ విషయంపై లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. నా పెళ్లి గురించి ఎక్కువ శాతం మంది మాట్లాడుకున్నారు ఎందుకు అలా జరుగుతుందో తనకు కూడా తెలియడం లేదని తెలుపుతోంది.

Actress Lavanya Tripathi Thrilled to Work With 3 South Superstarsఅంతేకాకుండా సమయం వచ్చినప్పుడు తప్పకుండా తన పెళ్లి గురించి మాట్లాడుతాను నా తల్లితండ్రులు నన్ను వివాహం చేసుకోమని బలవంతం చేయలేదు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని అంటూ తెలిపింది లావణ్య త్రిపాఠి. నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపుగా పదేళ్లు అవుతోంది. కనుక నేను వైవాహిక జీవితంలో అడుగుపెట్టి అవకాశం ఉందని చాలామంది భావిస్తున్నారు కానీ ప్రస్తుతానికి పెళ్లి పైన ఆసక్తి లేదు నటించాలని ఎక్కువ ఉత్సాహం ఉందని తెలుపుతోంది.

Share post:

Latest