ఏడాదికే శ్రీ‌లీల ఇంత బిజీగా మార‌డానికి ఆ స్టార్ హీరోనే కార‌ణ‌మా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్‌ బ్యూటీ శ్రీలీల చేతినిండా ప్రాజెక్టులపై ఎంత బిజీగా మారిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయమై ఏడాదే అయింది. చేసింది కూడా రెండే సినిమాలు. కానీ యంగ్ హీరోలకే కాకుండా స్టార్ హీరోలకు కూడా శ్రీ‌లీల‌ మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది.

ఇప్పుడు శ్రీలీల‌ చేతిలో దాదాపు పది చిత్రాలు ఉన్నాయి. అయితే వచ్చిన ఏడాదికే శ్రీ‌లీల ఇంత బిజీగా మారడానికి ఓ స్టార్ హీరో కారణమని టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మహేష్ బాబు వల్లే శ్రీలీల టాలీవుడ్ లో వ‌రుస ఆఫర్లతో జోరు చూపిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో పూజా హెగ్డేను మొదట హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ తర్వాత శ్రీలీలను కూడా హీరోయిన్ గా ఎంపిక చేశారు. నిజానికి మహేష్ సినిమాల్లో మాక్సిమం స్టార్ హీరోయిన్లే ఉంటారు. కానీ ఒక యంగ్ హీరోయిన్ ను మహేష్ సినిమాలో తీసుకోవడంతో అందరి దృష్టి ఆమెపై పడింది. దాంతో టాప్ హీరోల నుంచి యువ హీరోల వ‌ర‌కు అంద‌రూ శ్రీ‌లీల‌నే హీరోయిన్ గా తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు.

Share post:

Latest