టీడీపీతో పొత్తుపై పవన్ డౌట్..క్లారిటీ అక్కడే.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటుందా? అంటే ఉండే ఛాన్స్ ఉంది..లేకపోయినా ఆశ్చర్యం లేదన్నట్లు పరిస్తితి ఉంది. దీని బట్టి చూస్తే పొత్తు విషయం లో కన్ఫ్యూజన్ ఉందనే చెప్పాలి. ప్రస్తుతం జనసేన-బి‌జే‌పి పొత్తులో ఉన్నాయి. పేరుకు పొత్తులో ఉన్నాయి గాని కలిసి పనిచేయడం లేదు. అదే సమయంలో టి‌డి‌పితో పొత్తు ప్రసక్తే లేదని బి‌జే‌పి అంటుంది. ఇటు టి‌డి‌పి సైతం బి‌జే‌పితో పొత్తు వేస్ట్ అని భావిస్తుంది.

ఇక జనసేనతో కలవడానికి టి‌డి‌పి రెడీగానే ఉంది. అటు జనసేన సైతం టి‌డి‌పితో కలిస్తే బెటర్ అనే ఆలోచిస్తుంది. రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి చిక్కులు తప్పవు. విడిగా పోటీ చేస్తే మాత్రం వైసీపీకే లాభం. అందుకే రెండు పార్టీలు పొత్తు దిశగానే వెళుతున్నాయి. కాకపోతే పొత్తుపై ఒక క్లారిటీ అనేది రావడం లేదు. అటు టి‌డి‌పి గాని, ఇటు జనసేన గాని ఖచ్చితంగా పొత్తు ఉంటుందని మాత్రం చెప్పడం లేదు. అయితే తమకు అనుకూలంగా ఉంటే పొత్తుకు రెడీ అని పవన్ ఇదివరకే చెప్పారు.

అటు టి‌డి‌పి సైతం పొత్తుకు సిద్ధంగానే ఉంది. ఇక మార్చి 14న మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ జరగనుంది. ఆ సభా వేదికగా పవన్..పొత్తులపై కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. వైసీపీపై విమర్శల దాడి చేస్తూనే…పొత్తుపై తేల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎటు చూసుకున్న జనసేన సింగిల్ గా గెలవడం జరిగే పని కాదు.

ఆ విషయం పవన్ కు తెలుసు..దీంతో పొత్తు తప్పదు..అలా అని పొత్తులో మరీ తక్కువ సీట్లు వచ్చిన కష్టమే. అటు టి‌డి‌పి సైతం ఎక్కువ సీట్లు వదులుకోవడానికి రెడీ లేదు. ఇలాంటి సందర్భంలో పొత్తు ఎటు తేలుతుందో చూడాలి.