బాలయ్య చేయలేని పని ఎన్టీఆర్ చేస్తున్నారా..?

నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బాలకృష్ణ , కళ్యాణ్ రామ్ ,తారకరత్న, ఎన్టీఆర్ తదితరులు సైతం ఎంట్రీ ఇచ్చి బాగానే విజయాలను అందుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా లెవెల్ లోనే పేరు సంపాదించి ఆస్కార్ బరిలో కూడా నిలిచారు. సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి సూపర్ హిట్ కాంబినేషన్లో ఎన్నో చిత్రాలు విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఎన్టీఆర్ తో పాటు ఏఎన్ఆర్ తో కూడా శ్రీదేవి నటించిన ఆ తర్వాత నాగార్జున ఫామ్ లోకి వచ్చాక ఆయనతో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంది.

ఇక చిరంజీవి ,వెంకటేష్, నాగార్జున ముగ్గురు కూడా శ్రీదేవితో జతకట్టి మంచి విజయాలను అందుకున్నారు. కేవలం ఒక్క బాలకృష్ణ మాత్రమే శ్రీదేవితో నటించలేదు. శ్రీదేవితో బాలయ్య కలిసి ఎందుకు నటించలేదు అన్న కారణం తెలియదు కానీ.. శ్రీదేవి ఫ్యామిలీ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్ .. ఇప్పుడు టాలీవుడ్ లోకి జూనియర్ ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యింది. ఎన్టీఆర్ 30వ సినిమాలో ఈమె హీరోయిన్ గా ఫిక్స్ చేశారు చిత్ర బృందం. ఇక అందుకు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి తరహాలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ స్క్రీన్ మీద ఆకట్టుకుంటుందని ఎన్టీఆర్ అభిమానులు శ్రీదేవి అభిమానులు భావిస్తున్నారు.శ్రీదేవితో బాలయ్య స్క్రీన్ పంచుకోకపోయినా ఆ తర్వాత తరం మాత్రం శ్రీదేవి ఫ్యామిలీతో కలిసి నటించడానికి ఎన్టీఆర్ కి అవకాశం వచ్చిందని చెప్పవచ్చు. గతంలో సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి మంచి పేరుగా ఎలా పొందారో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కూడా జోడి ఫాన్స్ కి ట్రీట్ అందిస్తుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Share post:

Latest