PS -2 సక్సెస్ కావడం కష్టమేనా..?

ప్రముఖ భారతీయ దర్శక దిగ్గజాలలో డైరెక్టర్ మణిరత్నం కూడా ఒకరు. తన డ్రీమ్ సినిమాగా తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా తమిళంలో తప్ప మరెక్కడా కూడా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. మొదటి పార్ట్ గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేశారు. రెండవ భాగాన్ని ఏడాది ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు.

PS2 Release Date: पोन्नियिन सेल्वन 1 की सफलता के बाद इस दिन रिलीज होगा इसका  सेकंड पार्ट, बाहुबली 2 से कनेक्शन - Ponniyin Selvan 2 Release Date Out Mani  Ratnam Shares a
అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమాకు మరిన్ని కష్టాలు వెంటాడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. దర్శక నిర్మాతలు ఈ సినిమాను అమ్ముకునేందుకు అనేక పాటలు పడుతున్నారని సమాచారం. ఒక్క తమిళంలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాలలో కూడా ఈ సినిమా డిజాస్టర్ గానే మిగిలింది. కార్తీ, విక్రమ్ ,జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష తదితరులు సైతం ఇందులో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని కూడా అందించడంతో మొదటి భాగం అంతంత మాత్రమే ఆకట్టుకుంది.

ఈ క్రమంలో రెండవ భాగంపై కూడా చిత్ర బృందం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకొని చిత్రీకరించారు. ఈ రెండు భాగాలను రూ .500 కోట్ల రూపాయలతో ఒకేసారి చిత్రీకరించారు. అయితే మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ .450 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తమిళంలో మొదటిసారిగా 200 కోట్ల రూపాయలు సాధించి పలు రికార్డును సైతం సృష్టించింది. ఎక్కువ శాతం తమిళ నేటివిటీ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించడంతో అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం పార్ట్ టూ కు కూడా తమిళ్లో తప్ప ఎక్కడ కూడా ఈ సినిమా హక్కులు కొనేందుకు బయలు ముందుకు రాలేదని సమాచారం.