పెళ్లి కాకుండానే త‌ల్లి అయిన శ్రీ‌లీల‌.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల పెళ్లి కాకుండానే ఇద్దరు బిడ్డలకు తలైంది. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో ఎంత బిజీ హీరోయిన్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది రెండు సినిమాలే అయినా యూత్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. దాంతో ఈ బ్యూటీ ఇటు యంగ్ హీరోలకే కాకుండా అటు స్టార్ హీరోలకు కూడా మోస్ట్ వాంటెడ్ బ్యూటీగా మారిపోయింది.

ఇప్పుడు శ్రీ‌లీల చేతిలో దాదాపు ప‌ది చిత్రాలు ఉన్నాయి. క్షణం తీరిక లేకుండా వరుస షూటింగ్లతో ఈ బ్యూటీ య‌మా బిజీగా గడిపేస్తోంది. ఇదిలా ఉంటే శ్రీ‌లీలకు సంబంధించి కొన్ని సంచలన నిజాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. శ్రీ‌లీల‌కు ఇద్దరు పిల్లలు ఉన్నార‌ట‌. అదేంటి ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు కదా పిల్లలు ఎక్కడ నుంచి వచ్చారు అనేగా మీ డౌట్‌. శ్రీ లీల గొప్ప నటి మాత్రమే కాదు గొప్ప మనసు ఉన్న వ్యక్తి కూడా.

ఆ గొప్ప మనసుతోనే గురు మరియు శోభిత అనే ఇద్దరు అనాధ పిల్లలను దత్తత తీసుకుని పెంచుకుంటుంది. ఓసారి శ్రీ‌లీల‌ షూటింగ్ నేపథ్యంలో ఒక అనాధాశ్రమం కు వెళ్లిందట. అక్కడే వీళ్ళిద్దరిని చూసి ఎంతో జాలి వేసి వారిని దత్తత తీసుకుందట. ప్రస్తుతం ఆ ఇద్దరు పిల్లలు శ్రీ‌లీల ద‌గ్గ‌రే ఉంటున్నారు. సొంత బిడ్డల్లాగా శ్రీ‌లీల ఈ ఇద్ద‌రు పిల్ల‌ల‌ను పెంచుకుంటుంది. వారి బాగోగులను చూసుకుంటుంది. ఏదేమైనా చిన్న వ‌య‌సులోనే శ్రీ‌లీల చేసిన ఈ మంచి ప‌నికి నెటిజ‌న్లు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Share post:

Latest