చివరికి అలా దిగజారిన దిల్ రాజు.. వారి శ్రమనంతా దోచేశాడు??

ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కథ నచ్చితే చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని చూడకుండా తన బ్యానర్‌లో రూపొందిస్తాడు. అంతేకాకుండా బడ్జెట్ లెక్కలో దిల్ రాజుకి మించిన నిర్మాత లేరని టాలీవుడ్‌లో టాక్. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమాలో ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాని దిల్ రాజు కూతురు హన్షిత, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చి కాపీ రైట్ వివాదంలో చిక్కుకుంది.

ప్రముఖ దినపత్రికకి చెందిన జర్నలిస్ట్ సతీష్ గడ్డం బలగం కథ నాది అంటూ దానికి సంబంధించిన ఆధారాలను చూపిస్తున్నారు. దాంతో ఇదొక హాట్ టాపిక్ గా మారింది. గడ్డం సతీష్ మీడియా తో మాట్లాడుతూ.. ‘బలగం సినిమా ప్రీమియర్ షో చూడటానికి నాకు ఇన్విటేషన్ వస్తే వెళ్లాను. కానీ సినిమా చూడగానే అది నాకు అదే అని నాకు అర్థమైంది. 2011లో ‘పచ్చిక’ అనే పేరుతో నేను ఆ కాదని రాశాను. ఆ తరువాత 2014లో ఆ కదా ఒక పత్రికలో వచ్చింది కూడా. ప్రస్తుతం ఆ కథని తీసుకొని వేణు, దిల్ రాజు ‘బలగం ‘ పేరుతో సినిమా తీశారు. నేను రాసిన కథలో చిన్న మార్పులు చేసి సినిమాని రూపొందించారు ‘ అంటూ ఆరోపించాడు.

అంతేకాకుండా దిల్ రాజు గురించి మాట్లాడుతూ ‘ఎంతకాలం తర్వాత దిల్ రాజుకి మన తెలంగాణ కథలపై మనసు పడింది. అందుకు నాకు సంతోషం. కానీ కథని తీసుకునేటప్పుడు దానికి మూలం ఏంటి అని చూసుకోవడం నిర్మాతగా దిల్ రాజు బాధ్యత.” అని అన్నాడు. తన తాత చనిపోయిన్నపుడు ఆ పరిస్థితులను ఆధారంగా తీసుకొని ‘పచ్చిక’ కథని రాసానని గడ్డం సతీష్ చెప్పారు. 2011 ఆయన ఆ కథ రాయగా 2014లో ఓ తెలంగాణ వార్త పత్రిక ప్రచురించినట్లు ఆయన తెలిపారు. అలానే బలగం సినిమా డిమాండ్స్ తనకి ఇవ్వాలని సతీష్ డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా పై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. అయితే మరి బలగం టీమ్ సతీష్ చేసిన ఆరిపాణలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Share post:

Latest