ఈ హీరోల భార్య‌ల ఆదాయం తెలిస్తే మాట రాదు.. మైండ్ బ్లాకే…!

టాలీవుడ్ లోని స్టార్ హీరోలు ఒక్కొక్కరు కోట్లల్లో రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా టాలీవుడ్ సినిమాల హవా ఉండటంతో ఒక్కో సినిమాకీ రు. 50 నుంచి 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో హీరోలు మాత్రమే కాదు స్టార్ హీరోల భార్యలు కూడా ఆ రేంజ్‌ లోనే సంపాదిస్తున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు. అలా టాలీవుడ్ లో వ్యాపారాలు చేస్తూ సంపాదిస్తున్న హీరోల భార్యలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

స్నేహారెడ్డి :
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి కూడా చాలా వ్యాపారాలు ఉన్నాయి. అల్లు అర్జున్ సతీమణి తన తండ్రి ప్ర‌భాక‌ర్ రెడ్డి స్థాపించిన సెయింట్ ఇన్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా స్నేహారెడ్డి ఓ ప్రముఖ మ్యాగజైన్ కు ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఉపాస‌న కొణిదెల :
రామ్ చరణ్ సతీమణి ఉపాసన బిజినెస్ లో ఫుల్ బిజీగా ఉంటారు. ఉపాసన అపోలో హాస్పిటల్స్ వ్యాపారంలో తనదైన పాత్రను పోషిస్తున్నారు. కోట్లాది రూపాయ‌ల అపోలో హాస్ప‌ట‌ల్స్ వ్యాపారాన్ని ముందుకు న‌డిపించ‌డంలో ఆమె కీ రోల్ పోషిస్తున్నారు. అంతేకాకుండా యూట్యూబ్ ద్వారా సెలబ్రిటీలతో ఆరోగ్యకరమైన వంటకాలను వండిస్తు వాటిని ప్రజలకు పరిచయం చేస్తున్నారు.

సింగ‌ర్ చిన్మ‌యి :
అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ భార్య సింగర్ చిన్మయి కూడా వ్యాపారాలు చేస్తుంది. ఓ ఇంటర్వ్యూలో తన భార్య తనకంటే ఎక్కువ ఇన్‌కం ట్యాక్స్ ఫైల్ చేస్తుందని రాహుల్ రవీంద్రన్ తెలిపారు.

నంద‌మూరి స్వాతి :
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ భార్య కూడా వ్యాపార రంగంలో రాణిస్తుంది. ఎంబిబిఎస్ చదివిన కళ్యాణ్ రామ్ సతీమణి ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీని నడుపుతున్నారు. క‌ళ్యాణ్‌రామ్ సినిమాల వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ అంతా ఈ కంపెనీల్లోనే జ‌రుగుతుంది.

మంచు వెరోనికా రెడ్డి :
మంచు విష్ణు సతీమణి వెరోనిక కూడా పలు వ్యాపారాలు చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఓ క్లాతింగ్ కంపెనీకి ఆమె ఓనర్ గా ఉన్నారు. కుటుంబ ప‌రంగా ఉన్న వ్యాపారాలు కూడా ఆమె చూసుకుంటున్నారు. అంతేకాకుండా మోహన్ బాబు హీరోగా నటించిన సన్నాఫ్ ఇండియా సినిమాకు వెరోనిక డిజైనర్ గా పనిచేశారు.

Share post:

Latest