బిగ్ బాస్ -7 లో ఈసారి భారీ మార్పులు..!!

తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాల్టీ షోతో పేరుపొందింది బిగ్ బాస్. ఇప్పటివరకు ఆరు సక్సెస్ ఫుల్ గా సీజన్లను పూర్తి చేసుకుంది.అంతకుముందు వచ్చిన ఐదు సీజన్లు బాగానే సక్సెస్ కాగ ఆరో సీజన్ మాత్రం అంచనాలను అందుకొలేకపోయింది. మొదటినుంచి ఒక టాప్ కాంటెస్ట్ ని విన్నర్గా చేయాలని డిసైడ్ అయ్యి అతని మీద ఫోకస్ పెట్టినట్టుగా ఉందంటూ ఆడియన్స్ ఆ విషయాన్ని గుర్తించేలా చేశారు బిగ్ బాస్. అయితే ఎలాగోలాగా ఈ సీజన్ పూర్తి అయింది ఫైనల్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకోలేకపోయింది సీజన్ 6 డిజాస్టర్ కావడం వల్ల హోస్ట్ గా నుంచి నాగార్జున తప్పుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి.

Premiere date to contestants: Exclusive details of Bigg Boss Telugu 7
బిగ్ బాస్ నుంచి ఈ మధ్య లీకులు కూడా ఎక్కువ అవుతున్న కారణంగా సెట్ నుంచి కూడా అక్కడి నుంచి వేరే చోటికి షిఫ్ట్ చేయబోతున్నారని టాక్. మొదటి సీజన్ పూణేలో బిగ్ బాస్ సెట్ వేశారు. నామినేషన్ ఎలిమినేషన్ ఇలా ప్రతి దానికి ఆడియన్స్ లో ఒక ఆసక్తి ఉండేది.. అయితే ఎప్పుడైతే అన్నపూర్ణ స్టూడియోలో వేశారు.అప్పటి నుంచి లీకులు ఎక్కువగా మొదలయ్యాయి. సీజన్ సిక్స్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు ముందు రోజే తెలిసిపోయింది.. ఎపిసోడ్ టైంలో పెద్దగా కిక్కు లేక పోయింది అందుకే సీజన్ -7 నుంచి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడుతున్నారట బిగ్బాస్ నిర్వాహకులు.

హైదరాబాద్ నుంచి బిగ్ బాస్ సెట్ నీ చెన్నైకి షిఫ్ట్ చేయబోతున్నట్లు సమాచారం. అక్కడ నుంచి లీక్స్ రాకుండా కొత్త టీంను ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ -7 కి టెక్నికల్ టీం కి కూడా తెలుగువారికి అవకాశం లేనట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈసారి హోస్ట్ గా నటుడు రానా అని తీసుకొని అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈసారి తెలుగు సీజన్ -7 మాత్రం సీరియస్ గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

Share post:

Latest