తారకరత్న హాస్పిటల్ బిల్లు కట్టింది అతనే.. లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్..!!

నందమూరి కుటుంబంలో నుంచి హీరోలుగా ఎంతోమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. అయితే అలా సక్సెస్ కాలేక పోయిన వారిలో తారక రత్న కూడా ఒకరు. తారకరత్న సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ 9 సినిమాలతో ఎంట్రి ఇవ్వడం జరిగింది. ఇది ఒక అరుదైన రికార్డుగా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నది. అయితే తారకరత్న గడిచిన కొద్దిరోజుల క్రితం గుండెపోటుతో మరణించారు. తారకరత్న మరణించినప్పటి నుంచి ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంది.

తారకరత్న మరణంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సంచలన కామెంట్స్ | ycp  leader lakshmi parvathi sensational comments on tarakaratna death– News18  Telugu

నారా లోకేష్ చేపట్టిన యువ గళం పేరుతో పాదయాత్రను మొదలుపెట్టారు. అందులో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో కింద పడిపోవడంతో అప్పటినుంచి ఆయన బెంగళూరులో హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.కానీ 23 రోజులపాటు ఆసుపత్రిలో ఉన్న ఎలాంటి మార్పు రాలేదు.చివరికి తుది శ్వాస విడిచడం జరిగింది. అయితే ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు తారకరత్నను బాలయ్యే దగ్గరుండి చూసుకున్నారని వార్తలు వినిపించాయి.ఆయన ఆసుపత్రి బిల్లు కూడా బాలయ్య, చంద్రబాబు నాయుడు మాత్రమే భరించారంటూ కూడా పలు వార్తలు కథలుగా వినిపించాయి.

ఈ విషయంపై లక్ష్మీపార్వతి స్పందిస్తూ తారకరత్న ఆసుపత్రి బిల్లు మొత్తం కట్టింది విజయసాయిరెడ్డి అంటూ తెలియజేసింది. తారకరత్న ఆస్పత్రి బిల్లు మొత్తం బాలయ్య కట్టారంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు. చంద్రబాబు ,బాలయ్య కేవలం వచ్చి పరామర్శించి వెళ్లడం మాత్రమే నిజమని తెలుపుతోంది. వారు కట్టని బిల్లును మొత్తం తామే కట్టామని చెప్పుకోవడం కరెక్ట్ కాదని అంతా తనకు తెలుసు అంటూ తెలియజేసింది లక్ష్మీపార్వతి. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.

Share post:

Latest