రణం సినిమా హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు క్రేజీ హీరోయిన్స్ గా పేరు పొందిన వారు చాలామంది ఉన్నారు.అలాంటి వారిలో హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ కూడా ఒకరు. 2005వ సంవత్సరంలో ప్రేమికులు అనే చిత్రం ద్వారా మొదటిసారి తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత గోపీచంద్ సరసన రణం అనే చిత్రంలో నటించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.అలాగే అల్లరి నరేష్ నటించిన బెండు అప్పారావు సినిమాలో కూడా కామ్నా జెఠ్మలానీ నటించి మంచి మార్కులు సంపాదించింది.

Kamna Jethmalani – Puredesipics

ముఖ్యంగా ఈమె అందం అభినయంతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత తన కెరియర్ లో సామాన్యుడు, కత్తి కాంతారావు ,టాస్ తదితర చిత్రాలలో నటించింది. ఇక తెలుగుతోపాటు ఈమె తమిళంలో కూడా నాలుగు సినిమాలు కన్నడలో కూడా మూడు చిత్రాలలో మలయాళంలో రెండు చిత్రాల చేసినట్టుగా తెలుస్తోంది. సినిమాలలో అవకాశాలు తగ్గుతున్న క్రమంలోనే కామ్నా జెఠ్మలానీ 2014 ఆగస్టు 11వ తేదీన బెంగళూరుకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది.

కామ్నా జెఠ్మలానీ వివాహం తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమయింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గా ఉంటూ తనకు తన కుటుంబానికి సంబంధించిన ఎటువంటి విషయాన్నైనా షేర్ చేస్తూ ఉంటుంది. బెంగళూరులో తన భర్తతో కలిసి నివాసం ఉంటున్న కామ్నా జెఠ్మలానీ ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది వారి ఆలనా పాలనా చూసుకుంటూ కేవలం గృహిణిగా ఉండడంతో పాటు తన భర్తకు వ్యాపారంలో తోడుగా ఉంటున్నట్లు సమాచారం ప్రస్తుతం ఈమెకు సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Kamna Jethmalani (@kamana10)

Share post:

Latest