డైరెక్టర్ పూరి సోదరుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నరు పూరి జగన్నాథ్.ఒకప్పుడు ఈయన ఎన్నో సినిమాలతో సక్సెస్ ని సాధించారు. పూరి జగన్నాథ్ కి ఒక ఇద్దరు సోదరులు ఉన్నారు. అందులో ఒకరి పేరు సాయి రామ్ శంకర్. ఈయన మొదట ఇడియట్ అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమాకి పూరి దగ్గరే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. అలాగే రవితేజ పక్కన ఫ్రెండ్గా ఇడియట్ సినిమాలో నటించాడు. ఆ తరువాత హీరోగా చేయాలని పూరి పట్టు పట్టి మరి అతన్ని హీరోగా చేశాడు.

Puri Jagannath Petla Umashankar Ganesh: పూరి జగన్నాథ్ తమ్ముడు ఒక ఎమ్మెల్యే  అనే విషయం మీకు తెలుసా | do you know puri jagannadh brother is a mla Petla  Umashankar Ganesh details, puri jagannadh brother, director

హీరోగా మొదట 143 అనే సినిమాతో తెలుగు తరకు ఎంట్రీ ఇచ్చారు ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఆ తరువాత చేసిన చాలా సినిమాలతో తన టాలెంట్ ని నిరూపించుకోలేకపోయాడు. అయితే సాయి హీరోగా ఒక హిట్ కోసం ఇప్పటివరకు చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని చెప్పవచ్చు.సాయి అడపాదడపా సినిమాలను చేస్తున్నప్పటికీ వాటిలో ఒక్క సినిమా కూడా క్లిక్ అవ్వడం లేదు.

హీరోగా సక్సెస్ లు రాకపోవడంతో పూరి డైరెక్షన్లో రవితేజ హీరోగా వచ్చిన నేనింతే సినిమాలో ఒక ముఖ్యపాత్రలో నటించాడు. ఆ పాత్ర చేసినందుకు సాయి రామ్ శంకర్ కి మంచి పేరు వచ్చింది. కానీ నేనింతే కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. సాయి ఎన్ని సినిమాల్లో చేసిన ఏ క్యారెక్టర్ చేసిన అన్ని పేరు సంపాదించలేకపోయాయి.. సక్సెస్లు రాకపోయినా సాయి మాత్రం ఇండస్ట్రీని వదలకుండా తన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవైపు వెబ్ సిరీస్ లలో చేస్తూ మరోవైపు హీరోగా సక్సెస్ పొందేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు సాయి రామ్ శంకర్.

Share post:

Latest