తారకరత్న అందుకున్న మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

ఏ సినిమా ఇండస్ట్రీలో నైనా నటీనటులు ఒక్క సినిమా సక్సెస్ అయిందంటే చాలు అమాంతం రెమ్యూనరేషన్ పెంచేస్తూ ఉంటారు. దాదాపుగా ఇప్పుడు టాలీవుడ్ లో కూడారూ .100 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలు చాలామందే ఉన్నారు. కెరియర్ ప్రారంభంలో రూ .5లక్షల నుండి రూ .10 లక్షల రూపాయలు అందుకున్న హీరోలు కూడా ఉన్నారు. ఇక చిరంజీవి లాంటి హీరోలు అయితే మొదట రూ.5000 నుంచి పదివేల రూపాయల రెమ్యూనరేషన్తో కూడా సినిమాలలో నటించారు.

Okato Number Kurradu (2002) | V CINEMA - Movie, Review, Cast, Songs &  Release Date

ఇటీవల కాలంలో మృతి చెందిన నందమూరి తారకరత్న దాదాపుగా 20 సంవత్సరాల క్రితమే ఒకటో నెంబర్ కుర్రాడు అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ లో అశ్వని దత్ నిర్మించడం జరిగిందట. ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో అశ్విని దత్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.. అశ్విని దత్ మాట్లాడుతూ ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాలో తారకరత్నను పరిచయం చేయాల్సి వచ్చిన సమయంలో బడ్జెట్ గురించి చాలా ఆలోచించామని తెలిపారు. బడ్జెట్ కాస్త ఎక్కువగానే పెట్టాలనుకున్నాము అందుకే హీరో తారకరత్న రెమ్యూనరేషన్ తగ్గించాలనుకున్నాము..

Telugu actor and politician Nandamuri Taraka Ratna passes away

అందుకు తారకరత్న కూడా ఓకే చెప్పారని కేవలం అన్ని ఖర్చులతో కలిపి రూ .10 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారని తెలిపారు. తారకరత్న రేమ్యునరేషన్ పై దృష్టి పెట్టకుండా మంచి కథలు చేయాలి మంచి సినిమాలను నటించాలని కోరుకునే వ్యక్తి అని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఒకేసారి 9 సినిమాలను ప్రారంభించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సైతం సొంతం చేసుకున్న తారకరత్న అన్ని సినిమాలకు కూడా అడ్వాన్సులు తీసుకున్నారు. కానీ కొన్ని సినిమాలను పూర్తి చేశారు మరికొన్ని సినిమాలకు నిర్మాతలకు అడ్వాన్స్ తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం.