డర్టీ పిక్చర్ భామను రూమ్‌కి పిలిచిన డైరెక్టర్.. తర్వాత చేసిన పనికి??

ప్రముఖ నటి విద్యాబాలన్, ఫిమేల్ సెంట్రిక్ సినిమాల్లో నటించి చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ ఇండియన్ సినిమాల్లో పెద్దగా నటించక పోయినా దేశవ్యాప్తంగా పాపులర్ బాగా పాపులర్ అయింది. అయితే విద్యా తన కెరీర్‌లో లైంగిక వేధింపులను ఎదుర్కొంది, కానీ ఆమె ఎప్పుడూ తన వ్యక్తిత్వ విషయంలో రాజీపడలేదు.

ఒక ఇంటర్వ్యూలో విద్యా బాలాన్ మాట్లాడుతూ చెన్నైలోని ఒక సినీ డైరెక్టర్‌తో ఆమెకి జరిగిన అసౌకర్య పరిస్థితిని ఎలా డీల్ చేసిందో పంచుకుంది. ఆమె చెప్పిన ప్రకారం.. తాను ఒక దర్శకుడి సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. ఆమె చెన్నైకి వెళ్లినప్పుడల్లా తనని కలవాలని దర్శకుడు కోరేవాడు. అయితే ఆమె మరో సినిమా షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు, దర్శకుడు ఆమెను కాఫీ షాప్‌లో కలిశాడట. ఆ సమయంలో దర్శకుడు విద్యని తన గదికి రమన్ని పట్టుబట్టడంతో ఆమె వెళ్ళింది. అక్కడ విద్య చాలా అసౌకర్యంగా భావించింది, అందుకే ఆమె తలుపు తెరిచి ఉంచింది. ఇక ఆమెని వదిలేయడమే మంచిదని దర్శకుడు భావించాడు. అంతేకాదు కోపరేట్ చేయలేదని ఆమెను సినిమా నుంచి పీకి పారేశాడు.

ఇంత చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నప్పటికీ విద్యా తన కెరీర్‌పై దృష్టంతా పెట్టి స్టార్ యాక్ట్రెస్ గా ఎదిగింది. కష్టపడి పని చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. నైతికత, విలువల విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదని, తన కోసం తాను నిలబడటం తప్పనిసరి అని విద్యా కథనం గుర్తు చేస్తుంది. ఈరోజుల్లో సాయి పల్లవి అలాంటి క్యారెక్టర్ కలిగి ఉంది. తన పర్సనల్ క్యారెక్టర్‌ విషయంలో సినిమాల కోసం సాయి పల్లవి ఎప్పుడు రాజీపడదు.

Share post:

Latest