దిల్ రాజు త‌న‌యుడిని చూశారా.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో!

డిస్ట్రిబ్యూటర్, బ‌డా నిర్మాత దిల్ రాజు రెండేళ్ల క్రితం నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లిలోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో తేజస్విని అనే అమ్మాయిని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజుకు ఇది రెండో వివాహం. దిల్ రాజు మొద‌టి భార్య అనిత గుండెపోటుతో మ‌ర‌ణించారు. అనిత మ‌ర‌ణం త‌ర్వాత దాదాపు మూడేళ్లు ఒంటరిగా ఉన్న దిల్ రాజు.. తన కూతురు హర్షిత రెడ్డి ప్రోద్భలంతో ఐదు ప‌దుల వ‌య‌సులో రెండో పెళ్లి చేసుకున్నారు.

అంతేకాదు, లేటు వ‌య‌సులో ఓ బిడ్డ‌కు తండ్రి అయ్యాడు. గ‌త ఏడాది దిల్ రాజు స‌తీమ‌ణి తేజ‌స్విని తల్లయ్యారు. ఆమె ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దిల్ రాజు త‌న‌యుడికి అన్వై రెడ్డి అంటూ నామ‌క‌ర‌ణం చేశారు. అయితే తాజాగా తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దిల్ రాజు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం భార్య తేజస్విని, కుమారుడు అన్వై రెడ్డి, సోదరుడు శిరీష్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

దిల్ రాజు కుమారుడి తలనీలాలను స్వామివారికి సమర్పించారు. ఆ తర్వాత మాడ వీదుల్లో నడుస్తున్న సమయంలో మీడియా కంట పడ్డారు. ఇంకేముంది దిల్ రాజు త‌న‌యుడి ఫోటోల‌ను క్లిక్ మ‌నిపించారు. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. అన్వై రెడ్డి చాలా క్యూట్ గా ఉన్నాడంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest