నాటు నాటు పాటపై దీపిక వ్యాఖ్యలు.. ఏడ్చేసిన ఫ్యాన్స్!!

ఆస్కార్ వేడుకలో స్టేజ్ పైకి వెళ్లి నాటు నాటు సాంగ్ వినే ఉంటారు, వినకపోతే ‘you’re about to’ అంటూ తన స్పీచ్ మొదలుపెట్టింది దీపికా పదుకొణే. 95వ ఆస్కార్ అవార్డ్స్ సందర్భంగా బ్లాక్ గౌను వేసుకుని బుట్ట బొమ్మలా మెరిసిపోతూ చిరునవ్వులు చిందిస్తూ చాలా చక్కగా ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాటను పరిచయం చేసింది దీపిక. ఆమె మాట్లాడుతుంటే, మధ్యలో కొంతమంది కేరింతలు కొట్టి ఎంకరేజ్ చేశారు. అయితే దీపిక ఎక్కడ కూడా తొనకకుండా చాలా కాన్ఫిడెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాను తనదైన శైలిలో వివరించింది. ఆ తరువాత దీపిక మరోసారి అందరినీ ఆకర్శించింది. ఈసారి ప్రజెంటేషన్‌తో కాదు తన కన్నీటితో. అదేంటి ఏమైందని అనుకుంటున్నారా.

అసలు విషయంలోకెళితే ఆస్కార్ వేదికపై భారతీయ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందని ప్రకటించగానే దీపికకు కన్నీళ్లు ఆగలేదు. కీరవాణి, చంద్రబోస్ అవార్డులను చూపిస్తున్నంత సేపు దీపిక సంతోషంతో కన్నీళ్లు కారుస్తూనే ఉంది. వాస్తవానికి ఆస్కార్ అవార్డు అందుకునే స్థాయి వరకు చేరుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్‌ గురించి అందరూ ఆలోచిస్తారు. కానీ వారు పడిన కష్టానికి ప్రతిఫలం లభించినప్పుడు కలిగే ఆనందాన్ని మనం అంచనా వేయలేం.

అయితే ఒక భారతీయ నటిగా, ప్రతినిధిగా తమ భారత చిత్రానికి అవార్డు లభించింది అంటే ఎంత గర్వంగా ఉంటుందనేది దీపిక కన్నీళ్లను చూసి అర్థం చేసుకోవచ్చు. ఇక ఆమె నాటు నాటు ప్రజెంటేషన్ సందర్భంగా ఏం చెప్పింది అనే విషయాన్నికొస్తే, అదరగొట్టే కోరస్, కిల్లర్ డాన్స్ మూవ్స్ తో ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భారత విప్లవకారులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ మధ్య స్నేహాన్ని చాటి చెబుతూ ఈ సినిమాలోని ఒక కీలక సన్నివేశంలో వచ్చే పాట ఇది.

ఈ పాటను తెలుగులో పాడటంతో పాటు వలసవాది వ్యతిరేక ఇతివృత్తాన్ని సజీవంగా ప్రదర్శించడంతో ఇది సంచలనం సృష్టించింది. మరొకవైపు ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు ఇదే అని దీపిక పాటను పరిచయం చేసింది. ఇకపోతే ఆర్ఆర్ఆర్ గురించి దీపికాను ఎంపిక చేయడంపై తెలుగు ప్రేక్షకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest