దటీజ్ ఎన్టీఆర్.. ఎవరైనా ఎన్టీఆర్ తర్వాతే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి.. అభిమానులను ఆదరించే విధానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి విషయాన్ని అయినా సరే ముందుగా అభిమానులతో పంచుకున్న తర్వాతే తను ఆ పని ఇతరులకు చెబుతూ ఉంటారు. అందుకే అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా పేరు పొందడమే కాకుండా.. ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటుడుగా పేరు పొందారు. ఇక అంతే కాకుండా ఎన్నోసార్లు ఫంక్షన్లలో కూడా తమ అభిమానుల గురించి మాట్లాడుతూ ఉంటారు వారి క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు.

తాజాగా అమెరికా నడివీధుల్లో తమ అభిమానుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.. మీరు నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నారు దానికి రెట్టింపు ప్రేమ నాకు మీపై ఉంది.. కానీ దానిని చూపించలేకపోతున్న మనది రక్తసంబంధం కంటే చాలా గొప్పది మీరంతా నాకు సోదరులతో సమానమంటూ అభిమానుల మనసులు గెలుచుకున్నారు ఎన్టీఆర్. తాజాగా మరొకసారి గొప్ప మనసు చాటుకున్నాడు ఎన్టీఆర్ అసలు విషయంలోకి వెళ్తే ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ప్రస్తుత అమెరికాలో పర్యటిస్తున్నారు ఎన్టీఆర్. ఈనెల 12న జరగబోతున్న ఆస్కార్ అవార్డు కార్యక్రమంలో ఎన్టీఆర్ పాల్గొన్నారు.

అయితే ఈ కార్యక్రమానికి ఒక అభిమాని ఎన్టీఆర్ను రిక్వెస్ట్ చేశారు మా అమ్మకు మీరంటే చాలా ఇష్టం అన్న ఒకసారి ఆమెతో మాట్లాడతారా అని అడగగా వెంటనే ఓకే చెప్పారు..దీంతో అభిమాని తన తల్లికి వీడియో కాల్ చేయగా ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు.. ఎలా ఉన్నారమ్మ నేను బాగున్నాను తప్పకుండా కలుద్దాం అమ్మ అంటూ పలకరించారు ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఆయన సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు. మరి కొంతమంది దటీజ్ ఎన్టీఆర్ అంటూ పలు రకాలుగా పోస్ట్ షేర్ చేస్తున్నారు.

Share post:

Latest