లైగర్ సినిమా ఫ్లాప్ తర్వాత మొదటిసారి కనిపించిన చార్మి.. వీడియో వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తన అందంతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది హీరోయిన్ ఛార్మి ఈమె తక్కువ సినిమాలే చేసినా కూడా ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది.ఆ తరువాత ఈమె సినిమాలకు దూరమయ్యింది.అయితే చార్మి , డైరెక్టర్ పూరితో చార్మి కలిసే ఉంటోంది. ఇద్దరు నిర్మాతగా పలు సినిమాలకు వ్యవహరించారు. చార్మి లైగర్ ప్రమోషన్ కార్యక్రమాల సమయంలో కీలకంగా వ్యవహరించింది. అంతేకాకుండా పూరి నిర్మించే సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరించింది. అయితే లైగర్ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించకపోవడంతో చార్మి చాలా బాధపడటం జరిగింది. అయితే సినిమా ప్లాప్ అయ్యాక చార్మి జాడ ఎవరికీ తెలియలేదు.

లైగర్ సినిమాతో వరుసపరాజయాలతో విజయ్ దేవరకొండ కి కోలుకోలేని దెబ్బ తగిలింది. లైగర్ షూటింగ్ టైంలో మరియు ప్రమోషన్ కార్యక్రమాలలో డైరెక్టర్ పూరీ పక్కనే ఎక్కువగా ఛార్మి కనిపిస్తూ ఉండేది. డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరియర్ డేంజర్ జోన్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుస పరాజయాలతో సతమతమవుతున్న టైంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్టును అందుకున్నాడు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించిన ఈ లైగర్ చిత్రం నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాతో పూరి జగన్నాథ్ చాలా నష్టపోయాడు.

ఆ సినిమా పరాజయం పాలైన తరువాత చార్మి కనిపించలేదు. పూరీ ఒక్కరే కనిపిస్తున్నారు. ఈ క్రమంలో చార్మితో పూరి గొడవ పడినట్లు వార్తలు వినిపించాయి. ఇదంతా కాస్త పక్కన పెడితే లేటెస్ట్ గా చాలా నెలల తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చార్మి కనిపించింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో వీరిద్దరూ కనిపించడం జరిగింది. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు పలు ఫోటోలు తీస్తూ వీడియో కూడా చిత్రీకరించటంతో లేటెస్ట్ పూరి ఛార్మి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Share post:

Latest