రాజమౌళి వల్లే.. ఆ పాన్ ఇండియా చిత్రంలో నటించలేదు: రాశి ఖన్నా..!!

టాలీవుడ్ లోకి మొదట మనం సినిమా ద్వారా ఒక చిన్న పాత్రలో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశి ఖన్నా. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఈమె నటనతో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. గతంలో చిత్రాలలో కాస్త బొద్దుగా కనిపించి అందరిని ఆకట్టుకున్నది రాశి ఖన్నా. ఇక బాలీవుడ్ లో కూడా ఈ మధ్యకాలంలో పలు సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూనే ఉంది. అలాగే తెలుగు మలయాళం, తమిళ్ చిత్రాలలో కూడా పలు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Raashii Khanna : Baahubali Avantika I should have done, but Rajamouli…  Raashi Khanna!
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి ఖన్నా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తాను నటించిన మద్రాస్ కేఫ్ సినిమా అయిపోయాక రాజమౌళి బాహుబలి సినిమా కోసం ఆడిషన్స్ ని నిర్వహిస్తున్నారని తెలిసింది.. తమన్నా నటించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్ జరుగుతుందని ఆ రోల్ కోసం నన్ను పిలిచారు.. అక్కడికి ఆడిషన్స్ కు వెళ్లాను కానీ రాజమౌళి చూసి చాలా క్యూట్ గా ఉంది ఈ అమ్మాయి ఏదైనా లవ్ స్టోరీ కి బాగా సెట్ అవుతుందని తెలిపారట.

నా స్నేహితుడు మంచి ప్రేమ కథ పై వర్క్ చేస్తున్నారు ఒకసారి ఆ కథ విను నీకు తప్పకుండా నచ్చుతుందని తెలిపారుట రాజమౌళి. అలా ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా నేను తెలుగు లోకి లాంచ్ అయ్యాను కానీ రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర అయినా చేయాలని చెప్పుకొచ్చింది రాశి ఖన్నా. ప్రస్తుతం సర్దార్-2 అనే తమిళ మూవీ తోపాటు బాలీవుడ్లో యోధ అనే చిత్రంలో నటిస్తున్నది.

Share post:

Latest