బాహుబలి బ్యూటీ బాలయ్య సినిమాతో విలన్ గా ఎంట్రీ..!!

వీర సింహారెడ్డి, అఖండ చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరిచిత్రాన్ని తలకెక్కించబోతున్నారు. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కించడం జరుగుతోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కూడా నటిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

బాలయ్య సినిమాలో నటించబోతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు బాహుబలి సినిమాలో ఐటెం సాంగ్ లో నటించిన నోరా ఫతేహి. సినిమాలో ఈమె పాత్ర నెగిటివ్ పాత్ర ఉండబోతున్నట్లు సమాచారం.అంతేకాకుండా ఇమే పాత్ర కథకు అత్యంత కీలకంగా ఉంటుందని సమాచారం. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం ఎంతోమంది నటీమణులను సంప్రదించక డైరెక్టర్ అనిల్ రావిపూడి చివరకు ఈ బ్యూటీని ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై ఇంకా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు.త్వరలోనే ఈ విషయం ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ చిత్రంలో బాలయ్య కూడా 60 ఏళ్ల వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గడచిన సినిమాల్లో బాలయ్య ఇలాంటి పాత్రలు బాగానే ఆకట్టుకున్నాయి. ఇక కథ విషయంలో ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. నోరా ఫతేహి ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోతోంది అంటూ తెలియగానే ఈ సినిమా పైన మరింత హైప్ ఏర్పడింది. అయితే ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని డైరెక్టర్ అనిల్ రావిపూడి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరి ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Share post:

Latest